గోవా గ్రామంలో ఇక బహిరంగ ముద్దులకు పుల్‌స్టాప్
పానాజీ: గోవా బిచ్ అంటే వినోదం తారాస్థాయికి చేరుకుంటందనే విషయం అందరికీ తెలుసు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల తాకిడితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అయితే, గోవాలోని ఓ గ్రామంలో ఇకనుంచి బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై నిషేధం విధించారు.
గోవాకు వస్తున్న పర్యాటకుల్లో కొన్ని జంటలు మందు తాగుతూ మ్యూజిక్ పెట్టుకుని పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ నానా యాగీ చేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటంతో సల్వాదర్ డో ముండో గ్రామ సర్పంచ్ రీనా ఫెర్నాండేజ్ ఈ ముద్దులు పెట్టుకునే కార్యక్రమంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయమై రీనా మాట్లాడుతూ గోవాను సందర్శించే పర్యాటకుల్లో కొంతమంది ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తనకు ఎన్నో ఫిర్యాదులు అందాయన్నారు. పర్యాటకుల దుశ్చర్యలను నియంత్రించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిషేధాన్ని అమలు చేస్తూ ఓ తీర్మానం చేశామని తెలిపారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా విధించిన నిషేధానికి పర్యాటకులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో బహిరంగంగా మద్యం సేవించడాన్ని, చెవులు చిల్లులు పడే సంగీతాన్ని పెట్టుకోవడాన్ని, ముద్దులు పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ సాల్వడోర్ డో ముండోలో కట్టిన బ్యానర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఫేస్‌బుక్‌లో దానిపై మిశ్రమ స్పందనలు కనిపించాయి.












Click it and Unblock the Notifications