వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక దాడి: భార్యను బాబాకు భర్తే అప్పగించాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

woman
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో ఓ మహిళపై ఆమె భర్త, అత్తలతో కుమ్మక్కయి ఓ దొంగ బాబు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాబుతో పాటు మహిళ భర్తను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

బాబాతో లైంగిక క్రీడకు అంగీకరించాలని, లేదంటే ఇంటి నుంచి తరిమేస్తామని బాధితురాలి భర్త, అత్త ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. తన చైల్డ్‌కు శాంతి చేయాలని చెప్పి తనను ఈ ఏడాది మేలో భర్త, తల్లి షబీర్ అలియాస్ సాగర్ బాబు వద్దకు తనను తీసుకుని వెళ్లారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.

క్షుద్ర శక్తిని పారదోలడానికంటూ బాబా మే 4వ తేదీన తన ఇంటికి వచ్చాడని, బాబా దీపం వెలిగించి, దాని వైపు తదేకంగా చూడాలని చెప్పాడని ఆమె అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దీపం నుంచి నూనె తీస్తూ దాంతో మహిళకు మర్దన చేయడం ప్రారంభించాడు. తన అత్త ఉన్నప్పటికీ అతను ఆమె జననాంగాలను కూడా మర్దన చేశాడు.

విషయాన్ని మహిళ తన భర్తతో చెప్పింది. బాబాతో రతిలో పాల్గొనాలని, లేదంటే ఇంటి నుంచి తరిమేస్తామని భర్త కూడా ఆమెను హెచ్చరించాడు. గత నాలుగైదు నెలలుగా తన భర్తకు నచ్చజెప్పడానికి ఆ మహిళ ప్రయత్నిస్తోంది. అయితే, తన ప్రయత్నం ఫలించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పరారీలో ఉన్న బాధితురాలి అత్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
A newly-married woman was sexually assaulted by a self-proclaimed god man with the connivance of her husband and mother-in-law in Chhindwara district. The accused god man and the husband of the woman were arrested on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X