ఎట్టకేలకు వివాదాస్పద బాబా రాంపాల్ అరెస్టు

చండీఘడ్: తమను ముప్పు తిప్పలు పెట్టి, తమపై దాడికి దిగిన వివాదాస్పద స్వామీజీ రాంపాల్‌ను అరెస్టు చేశారు. బుధవారం రాత్రి పోలీసులు హర్యానాలోని బాల్వారాలో గల ఆశ్రమంలో ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో రెండు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు తెర పడింది. గురువారం ఉదయం హిస్సాపార్ కోర్టులో, శుక్రవారంనాడు పంజాబ్, హర్యానా హైకోర్టులో రాంపాల్‌ను ప్రవేశపెడుతామని పానిపట్ ఎస్పీ సతీష్ బాలన్ చెప్పారు.

చాలా కఠినమైన ఆపరేషన్ తర్వాత రాంపాల్‌ను అరెస్టు చేయగలిగామని డిజిపి ఎస్ఎన్ వశిష్ట్ అన్నారు. వేలాది మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఆశ్రమంలో ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చిందని అన్నారు. రాంపాల్‌ను పట్టుకునే క్రమంలో జరిగిన ఘర్షణల్లో 200 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 70 మంది జర్నలిస్టులు, 105 మంది పోలీసులు ఉన్నారు.

పోలీసులు 15 వేల మందిని వదిలేశారు. హింసకు పాల్పడ్డారనే ఆరోపణపై 492 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాంపాల్ పట్టుకునే క్రమంలో జరిగిన పరిణామాల్లో నలుగురు మరణించారు. నలుగురు మహిళలు ఆశ్రమంలో చనిపోగా, వారిని పోలీసులకు అప్పగించారు. మరో మహిళ, శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు.

'Godman' Rampal arrested, 15,000 followers freed, 492 held for violence

రాంపాల్‌ను సీనియర్ పోలీసు అధికారులు, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు చెందిన సిబ్బంది, హర్యానా పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి, బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్‌లో అతన్ని తరలించారు.

చివరకు ఆశ్రమంలోకి ప్రవేశించిన బలగాలకు రాంపాల్ అనుచరుల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. రాంపాల్ ముఖాన్ని వస్త్రంతో కప్పారు. మిషన్‌ను సమర్థంగా పూర్తి చేశామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ జవహర్ యాదవ్ అన్నారు.

రాంపాల్ ముఖ్య అనుచురుడు పురుషోత్తమ్ దాస్, అధికార ప్రతినిధి రాజ్ కపూర్‌లను అది వరకే అరెస్టు చేశారు. బర్వాలా సమీపంలోని సత్‌లోక్ ఆశ్రమం వద్ద బుధవారంనాడు పోలీసుల రాకతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు రాంపాల్ ఆరెస్టుతో కథ ముగిసింది.

విజయం సాధించాం: సీఎం

రామ్ పాల్‌ను అరెస్టు చేయడంలో విజయం సాధించామని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ అన్నారు. ఇప్పటికీ ఆశ్రమంలో వేల మంది ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. రామ్ పాల్‌కు బుధవారం ఉదయం ఆరోగ్య పరీక్షలు జరిపారు. కాగా, రామ్ పాల్‌కు హర్యానా హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+