Gold Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త వచ్చింది. గత కొద్ది రోజులు పుత్తడి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అదే స్థాయిలో వెండి ధరలు కూడా పెరిగాయి వెండి కిలో రూ.లక్ష దాటింది. ఇప్పుడు అదే స్థాయిలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల పుత్తడి ధర రూ.72000 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.78,560కు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్ గెలవడంతో డాలర్ విలువ పెరిగింది. రూపాయి విలువ తగ్గింది.
దీంతో బంగారం ధరలు కూడా తగ్గాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కు రూ.1790 తగ్గింది. 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు రూ. 16,50 తగ్గింది. ఇక వెండి ధరల కూడా తగ్గింది. రెండ్రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర నేడు నేడు ఏకంగా రూ.3000 తగ్గినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,02,000గా కొనసాగుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర నవంబర్ 6వ తేదీన 80,350 ఉండగా గురువారం (నవంబర్ 7)వ రూ. 78,560 రూపాయలకు చేరింది.

24 క్యారెట్ల ఒక గ్రాము పుత్తడి ధర రూ.7856 ఉంది. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.7200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర
రూ.73,810 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వర్ణం ధర రూ.80,510 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,660 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,360 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వర్ణం ధర రూ. 73,660 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.80,360 గా ఉంది.
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,360 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.73,660 గా ఉంది. బెంగళూరు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,660 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,360 గా ఉంది. బడ్జెట్ సమయంలో బంగారంపై సుంకం తగ్గించడంతో ధర తగ్గింది. ఆ తర్వాత భారీగా పెరిగింది. పుత్తడి ధర ఈ ఏడాది మార్చి నుంచి భారీగా పెరుగుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications