చెక్ పోస్టులో సినిమా చూపించిన అధికారులు, ఎన్ని రూ. కోట్ల నగలు అంటే ? సార్ పేరు, ఊరు !
చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలుకాలోని ఎంసీ గ్రామం చెక్‌పోస్ట్‌లో సరైన రికార్డులు లేకుండా తీసుకు వెలుతున్న రూ. 4.21 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు బీవీసీ రవాణా సంస్థకు చెందిన మహీంద్ర వాహనాన్ని ఎంసీ హాల్లీ చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు, ఎన్నికల అధికారులు అడ్డుకోవడం కోట్ల రూపాయాల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన నగల విలువ సుమారు నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని, మొత్తం 6 కేజీల 586 గ్రా బరువున్న బంగారు ఆభరణాలు తరలించడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. బంగారు నగలతో పాటు రూ. 2. 47 లక్షల రూపాయల విలువైన ఒక కేజీ 873 గ్రా బరువున్న వెండి ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. ఈ కేసుతో సంబంధం చిక్కమగళూరు జిల్లాలోని మధుగిరి జిల్లా మేనేజర్ గోపాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

అక్రమంగా లైసెన్సు లేకుండా నాటు తుపాకులు పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన మూడిగెరె ప్రాంతంలో బణకల్ హోబలిలో జరిగింది. బణకల్ హోబళియ బసని హెగ్గుడ్లు గ్రామ లోకేశ్ ఏ లైసెన్సు లేకుండా ఇంట్లో అక్రమంగా నాటు తుపాకి పెట్టుకున్నాడని అధికారులకు కచ్చితమైన సమాచారం అందింది. నిందితుడు లోకేష్ ను అదుపులోకి తీసుకుని తుపాకితో పాటు 12 తూటాలను స్వాధీనం చేసుకుని అతని మీద భారతీయ ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల నియమాలు అమలులో ఉండటంతో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని జిల్లాలో ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అన్ని వాహనాలను పరిశీలిస్తున్నారు. ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు చెక్ పోస్టుల దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టడానికి బంగారు నగలు, నగదు, విలువైన వస్తులు తరలిస్తున్నారని అనుమానంతో ప్రతి వాహనాన్ని అధికారులు సోదాలు చేసి పంపిస్తున్నారు. కొత్తగా కొందరు వ్యక్తులు ఆర్ టీసీ బస్సుల్లో ఇలాంటి విలువైన వస్తులు తరలిస్తున్నారని అనుమానాలు రావడంతో ఆర్ టీసీ బస్సుల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications