తగ్గిన డిమాండ్: బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం డిమాండ్ బాగా తగ్గిపోయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. శుక్రవారం మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ. 190 తగ్గడంతో రూ.30,740గా ఉంది.

నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోపాటు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం కూడా బులియన్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని మార్కెట్ల వర్గాలు చెబుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి.

Gold price today: A fall of Rs 190 on global cues

గత రెండ్రోజులుగా పెరుగుదలను నమోదు చేసినప్పటికీ శుక్రవారం మాత్రం ధరలు తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గింది. రూ. 230 తగ్గడంతో శుక్రవారం మార్కెట్లో కిలో వెండి ధర రూ.39,200 పలికింది.

అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. 0.73శాతం తగ్గిన బంగారం ధరలు.. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 1.222.40డాలర్లుగా ఉంది. 1.48శాతం తగ్గి ఔన్సు వెండి ధర 15.35డాలర్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+