Today gold price:రెండోసారి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి మాత్రం స్థిరంగా..

ముంబై: గత వారం రోజుల్లో రెండోసారి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీయ వ్యాపారులు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయని నిపుణులు పేర్కొన్నారు.

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 40 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 40,370కి క్షీణించింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 40 తగ్గింది. దీంతో 10 గ్రాముల ఈ బంగారం ధర రూ. 37,010కు పడిపోయింది.

విశాఖ, విజయవాడల్లోనూ..

విశాఖ, విజయవాడల్లోనూ..

విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇలానే ఉన్నాయి. ఓ వైపు బంగారం ధర స్వల్పంగా తగ్గినప్పటికీ.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 48,750 వద్ద నిలకడగా ఉంది.

దేశ రాజధానిలో..

దేశ రాజధానిలో..

ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గింది. దీంతో 10గ్రాముల బంగారం ధర రూ. 39,000కు పడిపోయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 50 తగ్గింది. దీంతో 10 గ్రాముల ఈ బంగారం ధర రూ. 37,800కి క్షీణించింది. ఇక్కడ కూడా బంగారం ధర పెరిగినా వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. కిలో వెండి ధర రూ. 48,750 వద్దనే నిలకడగా ఉంది.

అంతర్జాతీయంగా..

అంతర్జాతీయంగా..

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.14శాతం తగ్గుదలతో 1,509.25 డాలర్లకు తగ్గింది. ఇక వెండి ధర కూడా ఔన్స్‌కు 0.24శాతం తగ్గడంతో 18.02డాలర్లకు పడిపోయింది. బంగారం ధర గత నెలలో ఆరేళ్ల గరిష్టస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా చోటుచేసుకుంటున్న దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+