today gold price: మరోసారి తగ్గిన బంగారం ధరలు, అదే బాటలో వెండి

న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెల్లర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరలు దిగివచ్చాయి.

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 130 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 39,810కి పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 130 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 36,940కి క్షీణించింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇదేవిధంగా ఉన్నాయి.

బంగారం బాటలోనే వెండి..

బంగారం బాటలోనే వెండి..

ఇక బంగారం బాటలోనే వెండి ధర కూడా పయనిస్తోంది. రూ. 190 తగ్గడంతో కిలో వెండి ధర రూ. 48,650కి పోయింది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు పడిపోయాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గుదలతో రూ. 38,500కు క్షీణించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 తగ్గడంతో రూ. 37,500కు తగ్గింది.

డిమాండ్ తగ్గడంతో..

డిమాండ్ తగ్గడంతో..

ఇక్కడ కూడా బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పడిపోయాయి. కిలో వెండి ధర రూ. 190 తగ్గడంతో రూ. 48,650కి క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అంతర్జాతీయంగానూ..

అంతర్జాతీయంగానూ..

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.32శాతం తగ్గడంతో 1468.75 డాలర్లకు పడిపోయింది. వెండి ధర కూడా క్షీణించింది. వెండి ధర ఔన్స్ కు 0.53శాతం తగ్గుదలతో 16.93 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర అక్టోబర్ లో ఆరేళ్ల గరిష్టస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.

బంగారం ధరలపై ప్రభావం...

బంగారం ధరలపై ప్రభావం...

బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలపై అంతర్జాతీయ అంశాలతోపాటు ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీరేట్లు, జువెల్లరీ మార్కెట్ల డిమాండ్, వాణిజ్య ఒప్పందాల్లో మార్పులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+