వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Gold prices: మరోసారి తగ్గిన బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి

|
Google Oneindia TeluguNews

ముంబై: మూడు రోజుల తర్వాత బంగారం ధర బుధవారం పెరిగినప్పటికీ గత నెలతో పోలిస్తే రూ. 2వేల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర కాస్త తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 39,800కు పడిపోయింది.

ఆ ఎద్దు పేడలో 'బంగారం’: ఇంట్లో కట్టేసి పేడలో వెతికేస్తున్నారు, ఇక అదేపని!ఆ ఎద్దు పేడలో 'బంగారం’: ఇంట్లో కట్టేసి పేడలో వెతికేస్తున్నారు, ఇక అదేపని!

తగ్గిన బంగారం ధరలు..

తగ్గిన బంగారం ధరలు..

అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 150 తగ్గింది. దీంతో ధర 10 గ్రాముల ధర 36,470కి క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం తగ్గకపోగా.. రూ. 500 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 48,500కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇలాగే ఉన్నాయి.

భారీగా పెరిగిన వెండి ధరలు

భారీగా పెరిగిన వెండి ధరలు

కాగా, ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర రూ. 150 తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 38,450కి పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 150 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 37,250కి క్షీణించింది. అయితే, వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. రూ. 500 మేర పెరగడం గమనార్హం. దీంతో కిలో వెండి ధర రూ. 48,500కు చేరింది.

అంతర్జాతీయ ప్రభావమే..

అంతర్జాతీయ ప్రభావమే..

అంతర్జాతీయ బలహీనమైన ట్రెండ్ కన్నా కూడా దేశీ జువెల్లర్స్, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ల విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర కూడా పైకి ఎగిసిందని భావిస్తున్నారు. గత మూడు నెలల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయంగా పెరిగిన ధరలు

అంతర్జాతీయంగా పెరిగిన ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగిపోయింది. ఔన్స్‌కు 0.28శాతం పెరుగుదలతో 1,491.20 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 1.33శాతం పెరగడంతో 17.55డాలర్లకు చేరుకుంది. బంగారం ధరలపై బ్రెగ్జిట్ ఆలస్యం తోపాటు పలు అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతున్నాయి.

English summary
Gold prices in India rebounded today after falling for three days in a row. On MCX, gold futures prices rose 0.42% to ₹38,040 per 10 gram. Silver futures on MCX rose 0.46% to ₹45,382 per kg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X