వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Swapna: బంగారం స్మగ్లింగ్, స్వప్నకు బెయిల్, విడుదలకు నో చాన్స్, ఉగ్రవాదులతో మేడమ్ కు లింక్ ? !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ కేరళ/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుదిపేసిన బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ ఆంటీ స్వప్న సురేష్ అలియాస్ స్వప్నకు బెయిల్ వచ్చినా ఆమె జైలు నుంచి విడుదల అయ్యే భాగ్యం ఇప్పట్లో లేనట్లు ఉందని వెలుగు చూసింది. విదేశాల నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన స్వప్నకు కోర్టు షరుతులతో బెయిల్ మంజూరు చేసింది. అయితే బంగారం స్మగ్లింగ్ కేసులో బెయిల్ వచ్చినా స్వప్నను ఇప్పట్లో విడుదల చెయ్యలేమని అధికారులు అంటున్నారు. స్వప్న సురేష్ కు దేశద్రోహులతో, ఉగ్రవాదులతో లింక్ ఉందనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారని, అందుకే ఆమె జైలు నుంచి ఇప్పుడే విడుదలయ్యే అవకాశం లేదని వెలుగు చూసింది.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 స్వప్న సుందరి స్కెచ్

స్వప్న సుందరి స్కెచ్

కేరళలోని తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబార కార్యాలయానికి కొన్ని నెలల క్రితం ఓ పార్శిల్ వచ్చింది. పార్శిల్ పై అనుమానంతో కస్టమ్స్ అధికారులు ఆ బాక్స్ ను తీసి పరిశీలించారు. అంతే దిమ్మతిరిగిపోయే బంగారం బిస్కెట్స్ దర్శనం ఇవ్వడంతో కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు. స్వప్న సుందరికి సంబంధించిన పార్శిల్ లో బంగారం బిస్కెట్స్ స్మగ్లింగ్ అయ్యాయని అధికారుల విచారణలో వెలుగు చూడటంతో అప్పటికే మేడమ్ జెండా ఎత్తేశారు.

 స్వప్న సుందరి + 20 మంది అరెస్టు

స్వప్న సుందరి + 20 మంది అరెస్టు

విదేశాల నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారని నమోదైన కేసులో కింగ్ పిన్ స్వప్న సురేష్ తో పాటు 20 మందికిపైగా అరెస్టు అయ్యారు. కేరళ స్మగ్లింగ్ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా కుదిపేసింది. కేరళ స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో జాతీయ ఇంటిలిజెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED), కస్టమ్స్ అధికారులు, సీబీఐ అధికారులు రంగంలోకి దిగి ఈ కేసును విచారణ చేస్తున్నారు.

 అధికార పార్టీతో స్వప్నకు లింక్

అధికార పార్టీతో స్వప్నకు లింక్

బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ అరెస్టు కాకముందే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యక్తిగత ప్రధాన కార్యదర్శి, అప్పటి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకరన్ ను ఆ పదవి నుంచి తప్పించారు. ఐఏఎస్ అధికారి శివశంకరన్ తో స్వప్న సురేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలుగు చూడటంతో ఆయన్ను అధికారులు మూడుసార్లు విచారణ చేసి వివరాలు సేకరించారు.

 సీబీఐ ఎంట్రీతో సీన్ రివర్స్

సీబీఐ ఎంట్రీతో సీన్ రివర్స్

కేరళ అధికార పార్టీ నేతలతో స్వప్న సురేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు పరిశీలించిన అధికారులు అందులో రూ. 1. 50 కోట్ల నగదు, 30 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు గుర్తించారు. స్వప్న సురేష్ కు కేరళ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సహకరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.

 స్వప్న ఆంటీకి బెయిల్

స్వప్న ఆంటీకి బెయిల్

బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న సురేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. స్వప్న సురేష్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని ఆమె న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. స్వప్న సురేష్ కేసులో 60 రోజులు దాటినా అధికారులు కోర్టులో చార్జీషీటు దాఖలు చెయ్యడంలో విఫలం అయ్యారని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఆమె తరుపు న్యాయవాదులు కోర్టుకు మనవి చేశారు. బంగారం స్మగ్లింగ్ కేసులో కొచ్చి కోర్టు స్వప్న సురేష్ కు బెయిల్ మంజూరు చేసింది.

 ఉగ్రవాదులతో స్వప్నకు లింక్ ?

ఉగ్రవాదులతో స్వప్నకు లింక్ ?

బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ నేరం చేసిందని కస్టమ్స్ అధికారులు సాక్షాలు సేకరించడంలో విఫలం అయ్యారని, 60 రోజులు దాటిపోయినా కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా సాక్షాలు సమర్పించలేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించడంలో బెయిల్ వచ్చింది. అయితే బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న స్వప్న సురేష్ కు అంతకు ముందే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.

 ఎప్పుడో చెప్పలేం !

ఎప్పుడో చెప్పలేం !

ఎన్ఐఏ అధికారుల విచారణ ఇంకా కొనసాగుతుందని, అందు వలన బంగారం స్మగ్లింగ్ కేసులో బెయిల్ వచ్చినా ఆమెను జైలు నుంచి విడుదల చేసే అవకాశం లేదని వెలుగు చూసింది. ఎన్ఐఏ అధికారుల విచారణ పూర్తి అయిన తరువాతే స్వప్న సురేష్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని ఓ అధికారి అంటున్నారు. మొత్తం మీద స్వప్న సురేష్ ఆంటీ ఇంకా కొంతకాలం జైల్లోనే కాలం గడపాల్సి రావడంతో ఆమె సన్నిహితులు హడలిపోయారు.

English summary
Gold Smuggling Case: Kerala gold smuggling accused Swapna got bail but remain the jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X