Gold smuggling: గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సీఎం, ఆయన భార్యకు ప్రత్యక్ష సంబంధాలు, స్వప్నా సురేష్, షాక్!

కొచ్చి/న్యూఢిల్లీ/బెంగళూరు: కేరళతో పాటు భారతదేశాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నా సురేష్ అలియాస్ స్వప్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో కేరళ సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని స్వప్నా సురేష్ బాంబు పేల్చింది. స్వప్నా సురేష్ తో పాటు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడు మందికి హైకోర్టు షరుతులతో జామీను మంజూరు చేసింది. షరతులు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైకోర్టు నిందితులకు సూచించింది.

విదేశాల నుంచి వందల కేజీల బంగారు బిస్కెట్లు అక్రమంగా రవాణా చేశారని ఆరోపిస్తూ స్వప్నా సురేష్ తో పాటు అనేక మంది అరెస్టు అయ్యారు. అయితే బెయిల్ వచ్చిన తరువాత సైలెంట్ గా ఉన్న స్వప్నా సురేష్ ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య, కూతురికి గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది. కేరళలో ఇంతకాలం ప్రతిపక్షాలు సీఎంకు ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయని పదేపదే ఆరోపణలు చెయ్యడం, ఇప్పుడు స్వప్నా సురేష్ కూడా అదే మాట చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

దేశాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు

దేశాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు

విదేశాల నుంచి కేరళలోని రాయబార కార్యాలయానికి బంగారు సమగ్లింగ్ కావడం కలకలం రేపింది. రూ. 13. 82 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కేరళతో పాటు భారతదేశంలోని ఏ రాయభార కార్యాలయానికి ఇంతకాలం ఇంత పెద్ద మొత్తంలో బంగారు స్మగ్లింగ్ కాకపోవడం, 2020లో అలాంటి బంగారు స్మగ్లింగ్ కేసు కేరళలో నమోదు కావడంతో ఆ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

స్వప్నా సురేష్..... శివశంకర్ ఐఏఎస్ అండ్ కో అరెస్టు

స్వప్నా సురేష్..... శివశంకర్ ఐఏఎస్ అండ్ కో అరెస్టు

కేరళ బంగారు స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నా సురేష్ అప్పట్లో మాయం కావడం, తరువాత తప్పించుని తిరుగుతున్న ఆమెను బెంగళూరులో అరెస్టు చెయ్యడం జరిగింది. కేరళ సీఎం పినరయి విజయన్ కు అప్పట్లో ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకరన్ ను అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

బెయిల్ మంజూరు

బెయిల్ మంజూరు

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ఐఏ అధికారులు, ఈడీ అధికారులు, కస్టమ్స్ అధికారులు విచారణ చేశారు. ఈ కేసులో అరెస్టు అయిన అందరి దగ్గర అధికారులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. స్వప్నా సురేష్ తో పాటు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ తో పాటు మరో ఏడు మందికి కేరళ హైకోర్టు షరుతులతో జామీను మంజూరు చేసింది. షరతులు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైకోర్టు నిందితులకు సూచించింది.

కేరళ సీఎం ఫ్యామిలీకి లింక్ పెట్టిన స్వప్నా మేడమ్

కేరళ సీఎం ఫ్యామిలీకి లింక్ పెట్టిన స్వప్నా మేడమ్

కేరళతో పాటు భారతదేశాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నా సురేష్ అలియాస్ స్వప్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని స్వప్నా సురేష్ బాంబు పేల్చింది.

బాంబు పేల్చిన స్వప్నా సురేష్..... ప్రతిపక్షాలకు బలం

బాంబు పేల్చిన స్వప్నా సురేష్..... ప్రతిపక్షాలకు బలం

గత ఏడాది హైకోర్టులో బెయిల్ తీసుకున్న తరువాత సైలెంట్ గా ఉన్న స్వప్నా సురేష్ ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు ఆయన భార్య కమల,, కూతురు గీతాకు గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది. కేరళలో ఇంతకాలం ప్రతిపక్షాలు సీఎంకు ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయని పదేపదే ఆరోపణలు చెయ్యడం, ఇప్పుడు స్వప్నా సురేష్ కూడా అదే మాట చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+