Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gold smuggling: సీఎం పేరు లీక్ తో హైడ్రామా, స్వప్నా ఫ్రెండ్ కిడ్నాప్ ?, అసలు ఏం జరిగింది ?, సీఎం ఫైర్ !

తిరువనంతపురం/కేరళ: బంగారు స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నా సురేష్ అలియాస్ స్వప్నా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే కేరళలో హైడ్రామా చోటుచేసుకుంది. స్వప్నా సురేష్ కు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారని ఆరోపణలు రావడం కలకలం రేపింది. సీఎం పినరయి విజయన్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, స్వప్నా సురేష్ కు సన్నిహితంగా ఉన్న వారిని కిడ్నాప్ లు చేసి బెదిరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో కిడ్నాప్ అయ్యాడని అనుకున్న వ్యక్తి ప్రత్యక్షం అయ్యి కేరళ సీఎం మీద, ప్రభుత్వ అధికారుల మీద ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బంగారు స్మగ్లింగ్ కేసులో తనను బలిపశువును చేసి సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని రెండు రోజుల ముందు స్వప్నా సురేష్ ఆరోపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

బాంబు పేల్చిన స్వప్నా సురేష్

బాంబు పేల్చిన స్వప్నా సురేష్


కేరళతో పాటు భారతదేశాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నా సురేష్ అలియాస్ స్వప్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని స్వప్నా సురేష్ మీడియా ముందు బాంబు పేల్చింది.

నేను బలిపశువు అయ్యాను...... సీఎం ఫ్యామిలీ లగ్జరీ లైఫ్

నేను బలిపశువు అయ్యాను...... సీఎం ఫ్యామిలీ లగ్జరీ లైఫ్


కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు ఆయన భార్య కమల, ఆయన కూతురు గీతాకు గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సంబంధాలు ఉన్నాయని స్వప్నా సురేష్ ఆరోపించడం కలకలం రేపింది. బంగారు స్మగ్లింగ్ కేసులో తనను బలిపశువును చేసి కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని రెండురోజుల ముందు స్వప్నా సురేష్ ఆరోపించింది.

 కేరళలో హైడ్రామా

కేరళలో హైడ్రామా

కేరళలో ఇంతకాలం ప్రతిపక్షాలు సీఎం పినరయి విజయన్ కు గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సంబంధాలు ఉన్నాయని పదేపదే ఆరోపణలు చేసి విషయం తెలిసిందే. ఇదే సమయంలో స్వప్నా సురేష్ ఆరోపణలు చేసిన సమయంలో కేరళలో హైడ్రామాకు తెరలేపింది. స్వప్నా సురేష్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న సరిత్ ను కొందరు గుర్తు తెలియన వ్యక్తులు కిడ్నాప్ చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

సరిత్ కూడా ఈకేసులో నిందితుడే

సరిత్ కూడా ఈకేసులో నిందితుడే

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్నా సురేష్ తో పాటు పీఎస్ సరిత్ కూడా అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. నేను సీఎం పినరయి విజయన్ మీద, ఆయన భార్య కమల, కూతురు గీతా మీద ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే సరిత్ ను కొందరు కిడ్నాప్ చేశారని, సీఎం మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని బుధవారం మరోసారి మీడియా ముందు స్వప్నా సురేష్ కేరళ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు.

కిడ్నాప్ కాదు.... విచారణ ?

కిడ్నాప్ కాదు.... విచారణ ?


స్వప్నా సురేష్ ఆరోపణలు చేసినట్లు సరిత్ ను ఎవ్వరూ కిడ్నాప్ చెయ్యలేదని వెలుగు చూసింది. సరిత్ ను హెచ్ఆర్ డీఎస్ అధికారులు విచారణ చెయ్యడానికి పిలుచుకుని వెళ్లారని వెలుగు చూసింది. లైఫ్ మిషిన్ పథకం స్కామ్ కు సంబంధించి సరిత్ ను ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చెయ్యడానికి వారి కార్యాలయానికి పిలుచుకుని వెళ్లారని ఆలస్యంగా వెలుగు చూడటంతో కేరళలో ఇంత హైడ్రామా జరిగిందని స్థానిక మీడియా తెలిపింది.

సరిత్ ఏం చెప్పాడంటే ?

సరిత్ ఏం చెప్పాడంటే ?

ఈ ఆరోపణలు విషయంపై సరిత్ మీడియాతో మాట్లాడాడు. విజిలెన్స్ అధికారులు మా ఇంటికి వచ్చారని, నోటీసులు కూడా ఇవ్వలేదని, తాను చెప్పులు కూడా వేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా బలవంతంగా పిలుచుకుని వెళ్లారని సరిత్ ఆరోపించాడు. లైఫ్ మిషన్ పథకం కేసుకు సంబంధించి తనకు ఎలాంటి ప్రశ్నలు వెయ్యలేదని, ఆ విషయంలో విచారణ కూడా చెయ్యలేది సరిత్ ఆరోపించాడు.

అధికారులు టార్చర్ పెట్టారు.... సీఎం ఫైర్

అధికారులు టార్చర్ పెట్టారు.... సీఎం ఫైర్


సీఎం పినరయి విజయన్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చెయ్యమని స్వప్నా సురేష్ మీద, నీ మీద ఎవరు ఒత్తిడి చేస్తున్నారు చెప్పు అంటూ తనను టార్చర్ పెట్టారని సరిత్ ఆరోపించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తనతో పాటు తన కుటుంబ సభ్యుల మీద వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఇది రాజకీయ కక్షలో భాగం అని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+