‘గోల్డ్ మెన్’ బప్పి లహరి కంటే భార్య వద్దే ఎక్కువ గోల్డ్!

'Golden man' Bappi Lahiri's wife owns more gold
కోల్‌కతా: బంగారు ఆభరణాల ధరించి దర్శనమిచ్చే బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పి లహరి కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు అతని భార్య వద్ద ఉన్నాయట. బంగారు, ఆభరణాలు ఇతర ఆస్తులు కలిపి అతనికి 12 కోట్ల రూపాయల మేర ఉన్నాయని తన నామినేషన్‌లో పేర్కొన్నారు. ఇంకా అతనిక బిఎండబ్ల్యూ, ఆడి కార్లతోపాటు ఐదు కార్లు ఉన్నాయట.

పశ్చిమ బెంగాల్‌లోని సెరంపూర్ లోకసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున బప్పి లహరి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అఫిడవిట్‌లో బప్పి లహరి పేర్కొన్న వివరాలు ఉన్నాయి. అతని వద్ద రూ. 17,67,451 విలువైన 754 గ్రాముల బంగారు ఆభరణాలు, అతని భార్య చిత్రాణి వద్ద రూ. 20,74,830 విలువైన 967 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి.

ఇంకా రూ. 2,20,000 విలువైన 4.62 వెండి ఆభరణాలు, అతని భార్య వద్ద రూ. 3,59,600 విలువైన 8.9 కిలోల వెండి, రూ. 4,27,535 విలువైన 3.2 డైమండ్ క్యారెట్స్ ఉన్నాయి. తనకు రూ. 2.93 కోట్ల చరాస్తులు, రూ. 9 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని బప్పి లహరి తన అఫిడఫిట్‌లో తెలిపారు.

బప్పి లహరి తను సంగీతం అందించిన ‘ఓ లా లా లా', ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్' పాటలతో ఎంత ప్రముఖ్యం పొందారో తను ధరించే ఆభరణాలతో కూడా అంతే ప్రచారం పొందారు. 2009లో ఓ టీవి కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ‘గోల్డెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా కీర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+