అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు స్పెషల్ ట్రైన్స్..
అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ ఓ శుభవార్తను అందించింది. శబరిమలకు ప్రత్యేక ట్రైన్లను అందుబాటులోకి తీసుకరానుంది. నవంబర్ నెలలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో ట్రైన్లలో ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక ట్రైన్ సేవలను భక్తులకు అందిచనుంది.
ఈ స్పెషల్ ట్రైన్స్ మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో అందుబాటులోకి రానున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్ వచ్చే నెల (నవంబర్) 16వ తేదిన సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక ట్రైన్ పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు మీదుగా శబరిమల చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ వచ్చేనెల 20వ తేదీన తిరుగు ప్రయాణమవుతుంది.

టిక్కెట్ ధరలు..
ఇక, ఈ ప్యాకేజీలీలో టీ, టిఫిన్, భోజనం, ఏపీ, నాన్ ఏసీ, వంటి సౌకర్యాలు ప్రయాణికులకు ఉన్నాయి. టికెట్ ధర ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475 ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో అయితే, రూ.18,790 చెల్లించాలి. సెకెండ్ ఏసీలో అయితే, రూ.24,215 చెల్లించాల్సి ఉంటుంది. అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపడం కొత్తేమీ కాదు. గతంలో కూడా స్పెషల్ ట్రైన్స్‌ను నడిపారు. శబరిమలకు ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం సమయంలో ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు. వారి కోసం నవంబర్ నెల చివరి వారం నుంచి డిసెంబర్, జనవరి నెలలో ప్రత్యేక రైళ్లను నడుపుతారు.












Click it and Unblock the Notifications