తిరుమల భక్తులకు గుడ్ న్యూస్, బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సేవలు, డబ్బులు !
బెంగళూరు: ఐటీ హబ్, సిలికాన్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నుంచి నుంచి తిరుపతి వెళ్లి అక్కడి నుంచి తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఓ శుభవార్త. ఇక నుంచి బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రజలు తిరుమల తీర్థయాత్ర చేయడం చాలా సులభం అవుతోంది. ఎందుకంటే బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ లో ప్రయాణం చేసి తరువాత తిరుపతి నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్లడానికి అవకాశం చిక్కింది.
హంచ్ వెంచర్స్‌తో కలిసి బ్లేడ్ ఇండియా సంస్థ బెంగళూరు-తిరుపతి మార్గంలో హెలికాప్టర్ సర్వీసు సేవలను ప్రారంభించింది. బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉంది. తిరుపతి నుంచి తరువాత భక్తులు తిరుమల చేరుకుంటారు. కర్ణాటక రాజధాని నుండి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతికి హెలికాప్టర్ లో వెళ్లడానికి అవకాశం వచ్చింది. ప్రతి నెల లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.

తిరుమల తీర్థయాత్రను సులభతరం చేయడానికి కొత్తగా బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుండి తిరుపతికి హెలికాప్టర్ ఈ సేవలను అందిస్తోంది. ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో హెలికాప్టర్ బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి 4.15 గంటల మధ్యలో తిరుపతి నుండి బెంగళూరుకు బయలుదేరవచ్చు.
తిరుపతికి బయలుదేరే హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణించడానికి అవకాశం ఉంది. హెలికాప్టర్ రైడ్ బెంగళూరు-తిరుపతి నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బెంగళూరు నుండి తిరుపతికి సుమారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రయాణించడానికి సమయం పడుతుంది. హెలికాప్టర్ సేవతో తిరుమల వెళ్లే భక్తులు దాదాపు 1. 5 గంటల్లో తిరుపతి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు అంటున్నారు.

తరువాత తిరుపతి నుంచి తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్‌లో ప్రయాణించాలంటే జీఎస్టీ మినహా దాదాపు రూ.3, 50, 000 ఖర్చు అవుతుంది. రూ. 3, 50, 000 నుండి పూర్తి హెలికాప్టర్ అందుబాటులో ఉంది. రూ. 3. 50, 000 లక్షలకు ఒకేసారి ఐదుగురు ప్రయాణికులు వెళ్లవచ్చు. ఒంటరిగా వెళుతున్నప్పటికీ మీరు ఈ ప్రైవేట్ హెలికాప్టర్ పొందవచ్చు.
ఫ్లైబ్లేడ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. BLADE India వెబ్‌సైట్‌లో లేదా 1800-102-5233లో బుకింగ్‌లు చేయవచ్చు. బుకింగ్‌లు కనీసం 24 గంటల ముందుగానే చేయాలి. దేశవ్యాప్తంగా యాత్రికులు తిరుపతి నగరానికి చేరుకుని తరువాత తిరుమల వెళ్లడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతిలోని విమానాశ్రయానికి(రేణిగుంట విమానాశ్రయం)కు చాలా మంది చేరుకుని తరువాత తిరుమల వెలుతున్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు ఫ్లైబ్లేడ్ ఇండియా ఛాపర్ సర్వీసును ప్రారంభించింది. నగరం నుంచి విమానాశ్రయానికి రెండు గంటల ప్రయాణ సమయాన్ని కేవలం 15 నిమిషాలకు తగ్గించింది. ఇది బెంగళూరు నుండి కర్ణాటకలోని మలెనాడు మరియు కబిని ప్రాంతాలకు ఛాపర్ సేవలను కూడా అందిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఫ్లైబ్లేడ్ ఇండియా గోవా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GTDC)తో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది.
-
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications