US Visa: యూఎస్ నుంచి శుభవార్త.. భారతీయులకు అదనంగా 2.5 లక్షల వీసా స్లాట్స్..
Indian Travellers: అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా వెళ్లాలని వేచి చూస్తున్న వేల మంది భారతీయులకు పెద్ద శుభావార్త వచ్చింది. అయితే ఇది ఒకింత భారతీయ ఓటర్లకను ఆకర్షించే ప్రయత్నంగా కూడా చెప్పబడుతోంది.
భారతదేశంలోని యూఎస్ ఎంబసీ తాజా ప్రకటన ప్రకారం.. పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థులతో సహా భారతీయ ప్రయాణికులకు యునైటెడ్ స్టేట్స్ మరో 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రకటించింది. దేశీయ దరఖాస్తుదారులకు సకాలంలో వీసా ఇంటర్వ్యూలను సులభతరం చేయడానికి ఈ కొత్త స్లాట్‌లు ప్రకటించబడ్డాయని తెలుస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది.

2024లో వరుసగా రెండవ సంవత్సరం ఇప్పటికే 10 లక్షల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు ఎంబసీ పేర్కొంది. ఇండియాలోని యూఎస్ కాన్సులేట్ ఈ వేసవిలో రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసా దరఖాస్తులను నిర్వహించాయి. మొదటిసారి దరఖాస్తు చేసుకున్న వారందరూ ధృవీకరించబడిన అపాయింట్‌మెంట్‌లను అందుకున్నారని వెల్లడించింది. ఎంబసీ ఇప్పుడు వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, కుటుంబాలను తిరిగి కలపడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 12 లక్షల కంటే ఎక్కువమంది ఇండియన్స్ యూఎస్ ప్రయాణం చేసినట్లు లెక్కల ప్రకారం వెల్లడైంది. ఇది 2023తో పోల్చితే 35 శాతం అధికం.
వీసా ప్రక్రియను మెరుగుపరచడానికి, వేగవంతం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ నిర్దేశించిన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని భారతదేశంలోని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి హైలైట్ చేశారు. వాగ్దానాన్ని కూడా నెరవేర్చగలిగినట్లు పేర్కొన్నారు. నిరంతరాయంగా పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఎంబసీలోని బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థులు అమెరికాలో అతిపెద్ద సంఖ్యలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 2023లో దాదాపు 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెల్లడానికి వీసాలు అందుకున్నారు. ఇది ఇతరదేశాల విద్యార్థులకు అందించినదాని కంటే ఎక్కువని తేలింది.












Click it and Unblock the Notifications