H-1B Visa ఫీజు దెబ్బ: గూగుల్ ఛలో బెంగళూరు- వేలమంది టెక్కీలకు అద్దిరిపోయే ఛాన్స్

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ బెంగళూరులో భారీ కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇది 20,000 మంది ఉద్యోగులకు సరిపడే భారీ ఆఫీస్ స్పేస్ ఇది. హెచ్ 1 బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం, ఈ ప్రాసెస్ మరింత కఠినతరమౌతున్న నేపథ్యంలో- భారత్ లోనే తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని ఆల్ఫాబెట్ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఇక్కడే కొత్త నియామకాలను చేపట్టబోతోంది. విదేశీ నిపుణులపై ఆధారపడటాన్ని తగ్గించుకోనుంది.

కఠినమైన H-1B వీసా విధానాల వల్ల అమెరికాలో విదేశీ నిపుణుల నియామకం చాలా ఖరీదు, సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. దీంతో గూగుల్ భారత్ లోనే తన కార్యకలాపాలను విస్తరించడం మొదలు పెట్టిందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బెంగళూరు శివార్లలోని వైట్‌ఫీల్డ్ టెక్ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకుంది గూగుల్. ఇది క్రమంగా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌కు కీలక వృద్ధి కేంద్రంగా మార్చబోతోంది.

Google expands office space in Bengaluru with up to 20000 more employees amid H-1B visa tightening

వైట్‌ఫీల్డ్ టెక్ కారిడార్‌ అలెంబిక్ సిటీలో ఏకంగా ఓ ఆఫీస్ టవర్‌ను లీజుకు తీసుకుంది. అదనంగా మరో రెండు టవర్ల కోసం ప్రయత్నాలు చేపట్టింది. ఈ మూడింట్లో కలిపి దాదాపు 2.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంటుంది. మొదటి టవర్ త్వరలో వినియోగంలోకి రానుంది. మిగిలిన టవర్లు వచ్చే ఏడాది పూర్తవుతాయి. సుమారు 6,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఓ టవర్ ను లీజుకు తీసుకున్నట్లు ఆల్పాబెట్ ధృవీకరించిందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. అదనపు స్థలం గురించి ఇంకా వెల్లడి కాలేదని వివరించింది.

ప్రస్తుతం ఆల్ఫాబెట్ కు భారత్ లో 14,000 మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్క్ ఫోర్స్ సంఖ్య 1,90,000 లకు పైమాటే. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం- ఈ మూడు టవర్లను కూడా ఆల్ఫాబెట్ పూర్తిగా వినియోగిస్తే, బెంగళూరు క్యాంపస్ 20,000 అదనపు ఉద్యోగులకు వసతి కల్పిస్తుంది. ఇది దేశంలో వారి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తుంది. H1B Visa కోసం లక్ష డాలర్లను చెల్లించడానికి బదులుగా భారత్ లోనే తన సంస్థ కార్యకలాపాలను విస్తరించడానికి గూగుల్ ప్రాధాన్యత ఇస్తోందని బ్లూమ్ బెర్గ్ తెలిపింది.

బెంగళూరులోని ఐటీ ఉత్పత్తిలో వైట్‌ఫీల్డ్ వాటా దాదాపు 22 శాతం. దేశంలోని అతి ముఖ్యమైన టెక్ క్లస్టర్‌లలో ఇది టాప్ లో ఉంటోంది. ఆల్ఫాబెట్ గత సంవత్సరం నగరంలో తన అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిప్ డిజైన్, మెషిన్ లెర్నింగ్‌తో సహా వందలాది ఉద్యోగాలు ఇక్కడ పని చేస్తోన్నారు. దీన్ని మరింత విస్తరించాలని, ఏకంగా 20,000 మందిని కొత్తగా తీసుకోవాలని నిర్ణయించిందని బ్లూమ్ బెర్గ్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+