టాప్ 10 క్రిమినల్స్‌: క్షమించండి, మళ్లీ రిపీట్ అవ్వదని మోడీకి గూగుల్

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి గూగుల్ క్షమాపణలు చెప్పింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో 'టాప్ 10 క్రిమినల్స్' అని కొడితే ప్రధాని మోడీ ఫోటో వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన గూగుల్ ఇలాంటి ఆశ్చర్యకర ఫలితాలు గందరగోళం లేదా పొరపాటు కారణంగానే వస్తాయని అన్నారు.

ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ ఫలితాలపై క్షమాపణ చెబుతున్నామని గూగుల్ అధికారి ఒకరు తెలిపారు. ఓ బ్రిటిష్ దినపత్రిక వెబ్‌సైట్లో మోడీ ఫోటో ఉంచిన పేజీ కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు గుర్తించామని తెలిపారు.

Google Is Sorry That India’s Prime Minister Appeared in a Top 10 List of Criminals

గూగుల్ సెర్చిలో టాప్ 10 క్రిమినల్స్ అని వెతికితే.. అందులో నరేంద్రమోదీ ఫొటో కూడా వస్తోంది. ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం, అల్ జవహరి.. ఇలాంటి కరడుగట్టిన నేరస్థుల జాబితాలోనే ప్రధాని మోడీ ఫోటో కూడా వస్తుంది.

టాప్ 10 క్రిమినల్స్ ప్రధాని మోడీ ఫోటో ఉండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తన దేశ ప్రధానమంత్రి పేరు టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో ఉండటం ఒక భారతీయుడిగా తనకు సిగ్గుచేటని, ఇది జాతికే అవమానమని డిగ్గీరాజా ట్వీట్ చేశారు. సిగ్గుతో తల దించుకుంటున్నానని కూడా ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+