సెక్స్ నిర్దారణ సమాచారాన్ని బ్లాక్ చేయనున్న గూగుల్
న్యూఢిల్లీ : లింగ నిర్దారణకు సంబంధించి ఇకనుంచి ఎలాంటి సమాచారం గూగుల్ లో దర్శనమివ్వదు. గూగుల్ మాత్రమే కాదు, యాహు, మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్లలోను దీనికి సంబంధించిన సమాచారాన్ని బ్లాక్ చేయనున్నారు. ఇండియాలో నిషేధం విధించిన కొన్ని అభ్యంతరకర సెక్స్ ప్రకటనలు ఆన్ లైన్ లో దర్శనమిస్తుండడంతో.. డాక్టర్ సాబూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
డాక్టర్ సాబూ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని వివరణ కోరింది. ఇదే క్రమంలో గూగుల్, యాహు, మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ల అధినేతలతో చర్చలు జరిపిన అధికారులు.. ఆ సమాచారాన్ని బ్లాక్ చేయాల్సిందిగా కోరారు.

ఇండియా విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సంస్థలు కూడా ఆయా నిషేధిత ప్రకటనల సమాచారాన్ని బ్లాక్ చేయడానికి అంగీకారం తెలిపాయి. ఆటో బ్లాక్ అనే ఆప్షన్ ను ఉపయోగించి ఈ సమాచారాన్ని ఇండియాలో బ్లాక్ చేయనున్నారు. ఇందుకోసం సెక్స్ నిర్దారణకు ఎక్కువగా ఉపయోగిస్తున్న 22 కీ వర్డ్స్ ను గుర్తించిన సంస్థలు.. నిషేధిత సమాచారాన్ని బ్లాక్ చేయనున్నాయి.
దేశవ్యాప్తంగా ఆడపిల్లల భ్రూణ హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో సెక్స్ నిర్దారణకు సంబంధించిన ప్రకటనలు ఆన్ లైన్ లో దర్శనమిస్తుండడంతో డాక్టర్ సాబూ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. దీంతో గత జూలై 15న కేంద్రాన్ని వివరణ కోరింది సుప్రీం కోర్టు. దేశంలో ఏటా 5లక్షల వరకు ఆడపిల్లల భ్రూణ హత్యలు చోటు చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు అలాంటి ప్రకటనలను నిషేధించడానికి రంగం సిద్దమైంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications