Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హ్యాండ్సాప్ అంటూ హల్‌చల్.. హైవేపై కార్లు దొంగిలిస్తున్న ముఠా... ఒక్కరోజే రెండు కార్ల దోపిడీ

జైపూర్ : ఇటీవల రాజస్థాన్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలోనే కాదు ఆఫీసులు, రహదారుల మీద కూడా భద్రత లేకుండా పోయింది. శంకర్ గుర్జార్ అనే పేరుమోసిన దొంగ ... పాయింట్ బ్లాంకులో తూపాకీ పెట్టి హైవే పై కార్లను దోచుకెళ్తున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు శంకర్ అండ్ కోను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. జైపూర్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది.

రాజస్థాన్‌లో శంకర్ గుర్జార్ హిస్టరీ షీటర్, పేరు మోసిన దొంగ.. దొంగతనాలు చేయడం .. దర్జాగా బతికేయడం .. ఇదీ శంకర్ అండ్ కో టీం పని. ఇటీవల ఓ బీఎండబ్ల్యూ కూడా కొల్లగొట్టేశాడు శంకర్. అందులోనే జైపూర్ రహదారిపై వస్తున్నాడు. అయితే అతని వాహనం ఇబ్బంది పెట్టింది. దీంతో దానిని ఆ రహదారి పై పెట్టి ... తన వద్ద ఉన్న తుపాకీ తీశాడు. ఇంకేముంది రాత్రి 10 గంటలకు ఉజ్వల్‌కు చెందిన ఓ కారు వచ్చింది. దానిని ఆపిన శంకర్ .. తనకు కారు ఇవ్వాలని కోరాడు. తాను కారు ఎందుకు ఇవ్వాలని వాదించాడు ఉజ్వల్. ఇంకేముంది తనదైన శైలిలో తుపాకీ తీసి .. పాయింట్ బ్లాంక్‌లో పెట్టి మరీ కారు తీసుకెళ్లాడు.

Goons BMW breaks down, so he shoots man, steals his car

ఈ విషయం ఉజ్వల్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే జైపూర్ హైవే పై గల రహదారులను బ్లాక్ చేశారు. కానీ అప్పటికే శంకర్ ఢిల్లీ హైవే మీద వెళ్తున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు కూడా ప్రయానించాడు. అయితే రహదారిపై ఉజ్వల్ కారు కనిపించింది. ఏంటా అని చూస్తూ అందులో శంకర్ అతని తోడుదొంగలు లేరు. వారు మరో కారు తీసుకొని పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. జైపూర్ రహదారి వద్ద ఉజ్వల్ గాయాలతో పడి ఉండటంతో అతనిని మన్ సింగ్ ఆస్పత్రికి తరలించారు. తన కారు వద్దకు శంకర్, అతని టీం వచ్చారని పేర్కొన్నారు. తనను కారు ఇవ్వమని అడిగారని .. అందుకు నిరాకరిస్తే తుపాకీతో బెదిరించారని .. దాడి చేశారని ఉజ్వల్ తెలిపారు. దీంతో శంకర్ అండ్ కో .. శికర్ రోడ్ వద్ద మరో కారు లూటీ చేసి కల్వార్ రోడ్ మీదుగా పారిపోయారు. శంకర్ టీం కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+