హర్యానా క్యాబినెట్‌లో గోపాల్ కందాకు నో ప్లేస్..? గత చరిత్ర నేపథ్యంలో...
హర్యానా రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీ రోల్ పోషిస్తున్నారు. జేజేపీ నేత దుష్యంత్ చక్రం తిప్పుదామని అనుకొన్న.. బీజేపీ వేగంగా స్పందించడంతో కాంగ్రెస్-జేజేపీ ప్రభుత్వం అనే అంశం కలగానే మారిపోయింది. అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాల్ కందాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన క్యాబినెట్ బెర్త్‌పై సందేహాలు నెలకొన్నాయి.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు కావాల్సి ఉండగా.. బీజేపీ 40 వద్దే ఆగిపోయింది. దీంతో ఇండిపెండెంట్ల మద్దతు తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో హర్యానా లోఖిత్ పార్టీ చీఫ్ గోపాల్ కందా రంగంలోకి దిగారు. 8 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుసుకొన్నారు. వీరిని బీజేపీ ఎంపీ సునీత దగ్గల్ తీసుకెళ్లారు. బేషరతుగా మద్దతిస్తామని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం క్యాబినెట్ బెర్తులు అడుగగా.. బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపిందని.. కానీ ఆయన గత చరిత్ర నేపథ్యంలో మంత్రి పదవీ దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది.

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రంజిత్ సింగ్‌తో గోపాల్ కందా గొడవపడినట్టు ఉన్న వీడియో ఒకటి గురువారం వైరల్ అయ్యింది. బీజేపీకి మద్దతిచ్చి రంజిత్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని కోరినట్టు గోపాల్ తెలిపారు. దీంతోపాటు 2012లో భూపిందర్ హూడా ప్రభుత్వంలో కూడా గోపాల్ మంత్రిగా పనిచేశారు. అయితే ఎయిర్ హోస్టెస్‌పై లైంగికదాడికి సంబంధించి అభియోగం వెలుగులోకి రావడంతో క్యాబినెట్ బెర్త్ ఊడిపోయింది. గత చరిత్ర నేపథ్యంలో బీజేపీ కూడా మంత్రి పదవీ ఆఫర్ చేస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications