బెంగళూరు మాల్ లో అగ్ని ప్రమాదం

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర గేట్ సమీపంలోని గోపాలన్ మాల్ లో సోమవారం ఉదయం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. గోపాలన్ మాల్ లోని మొదటి అంతస్తులో బ్రాండ్ ఫ్యాక్టరీ షోరూం ఉంది.

Gopalan Arcade Rajarajeshwari Nagar witnessed a fire accident in Bengaluru

ఈ బ్రాండ్ ఫ్యాక్టరీ షోరూంలో మంటలు వ్యాపించడంతో అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

మంటలు వ్యాపించిన సమయంలో మాల్ లో ఎక్కువ మంది సిబ్బంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు అన్నారు. బ్రాండ్ ఫ్యాక్టరీ షో రూం నుంచి ఇతర షోరూంలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Gopalan Arcade Rajarajeshwari Nagar witnessed a fire accident in Bengaluru

విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన మంటలు వ్యాపించి ఉంటాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎంత నష్టం జరిగింది అని అంచనా వేస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. రాజరాజేశ్వరినగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+