ముండే మృతి: డ్రైవర్ అరెస్ట్, బిజెపి ఆఫీస్‌కు రాహుల్

కారు డ్రైవర్ గుర్విందర్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేశారు. అతని వయస్సు 32. గుర్విందర్ సింగ్ తన సొంత కారు అయిన టాటా ఇండికాలో వస్తూ... ముండే ప్రయాణిస్తున్న మారుతీ సుజుకి ఎస్ఎక్స్4 వాహనాన్ని ఢీకొట్టారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. గుర్విందర్ రెడ్ లైట్‌ను లెక్కలోకి తీసుకోకుండా ముందుకు వచ్చాడా అనే విషయమై విచారణ చేస్తున్నామన్నారు.
ముండేకు రాహుల్ నివాళులు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపినాథ్ ముండే భౌతికకాయానికి కాంగ్రెసు ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ముండే కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముండే భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు రాహుల్ ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయానికి వచ్చారు.
గోపినాథ్ భౌతికకాయానికి బిజెపి నేతలు పలువురు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ బిజెపి నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జవదేకర్, రవిశంకర ప్రసాద్, వికె సింగ్, హర్షవర్ధన్, పాశ్వాన్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సిఎం వసుంధర రాజే తదితరులు సందర్శించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications