సొంత వైద్యం తెచ్చిన చేటు: యూట్యూబ్ చూస్తూ డెలివరీ.... ఏమైందో తెలుసా..?
గోరఖ్‌పూర్ : టెక్నాలజీ మనుషులకు ఎంతగా మేలు చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుంది. ఒకరిపై ఆధారపడకుండా సొంత పనులు చేయాలనుకుంటాం. ఒకరిపై ఆధారపడుకుండా కొన్ని పనులే సాధ్యమవుతాయి కానీ అన్ని పనులు సాధ్యం కావనేది చాలామంది తెలుసుకోరు. ఇలా ఒక్కరే ప్రయత్నం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే గోరఖ్‌పూర్‌లో జరిగింది. ఇంతకీ ఆ ఘటన ఏంటి... టెక్నాలజీ ప్రాణాలను ఎలా తీసింది... ?

యూట్యూబ్ చూస్తూ బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నం
గోరఖ్‌పూర్‌లో ఘోరం జరిగింది. సొంతంగా డెలివరీకి ప్రయత్నించిన ఓ పెళ్లికాని యువతి ఆమె ప్రాణాలు తీసుకుంది. అంతేకాదు ఈ ప్రయత్నంలో బిడ్డ ప్రాణాలు కూడా పోయాయి. ఇక నిండు గర్భిణీగా ఉన్న ఆమె పురిటి నొప్పులు రావడంతో సొంత వైద్యానికి దిగింది. డెలివరీ కోసం డాక్టరును సంప్రదించకుండా ప్రముఖ సోషల్ మీడియా యూట్యూబ్‌ను ఆశ్రయించింది. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిస్తుందనే విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని భావించిన యువతి తన డెలివరీ కోసం యూట్యూబ్‌ను ఆశ్రయించింది. యూట్యూబ్ చూస్తూ బిడ్డకు జన్మనివ్వాలని భావించింది. ఇక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. ఎవరి సహాయం లేకుండా బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.

ఇంట్లో నుంచి రక్తం బయటకు రావడంతో అనుమానం
ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే సోమవారం రోజున ఆ యువతి గది నుండి పొరిగింటి వారు రక్తం బయటకు రావడం గమినించి ఆ ఇంటి యజమానికి సమాచారం చేరవేశారు. ఇంటికి చేరుకున్న యజమాని తలుపులు కొట్టి లోపలికి ప్రవేశించాడు. అప్పటికే తల్లీ బిడ్డలు ఇద్దరూ మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అయితే పక్కనే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో ఆ యువతి బిడ్డకు జన్మనివ్వడం ఎలా అనే వీడియోను యూట్యూబ్‌లో చూసినట్లు పోలీసులు తెలిపారు. తల్లి మృతదేహం వద్ద కత్తెర, బ్లేడు, దారం కూడా పడి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

మృతి చెందడానికి నాలుగు రోజుల ముందే అద్దెకు ఇల్లు
ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితమే ఆ యువతి ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి గురించి వాకాబు చేసి ఆమె బంధువులకు తెలపగా ఆమెకు ఇంకా వివాహం కాలేదని వారు చెప్పారు. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితమే ఇల్లు అద్దెకు తీసుకున్న యువతి.... తన డెలివరీకి తన తల్లి వస్తుందని చెప్పినట్లు ఇంటి యజమాని తెలిపారు. ఆధార్ నెంబరు ఇతర వివరాలు తీసుకున్న తర్వాతే ఆమెకు ఇల్లును అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే గోరఖ్‌పూర్‌లో యువతి ఇల్లు అద్దెకు ఎందుకు తీసుకుందో పోలీసులకు అంతుచిక్కడం లేదు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications