సాహిత్య అకాడమీ అవార్డు: స్వీకరించిన గోరటి వెంకన్న.. సీజేఐతో భేటీ
ప్రముఖ రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును స్వీకరించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. పల్లె పదాలతో, పల్లె పాటలతో తనదైన శైలిలో రచనలతో గోరటి వెంకన్న తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రత్యేకించి పేదల ఇళ్లలోని అసౌకర్యాలు, బడుగులపై భూస్వాముల దౌర్జన్యాలను కళ్లకు కట్టినట్టు పాటలు రచించడమే కాకుండా వాటిని తన గొంతుకతోనే పాడే వెంకన్న తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు.
Telangana peoples poet @GoratiVenkanna receives Sahitya Academy Award in New Delhi.
— Prof. Chakrapani Ghanta (@GhantaC) March 11, 2022
Congratulations Venkanna 🎉#sahityacademy pic.twitter.com/KGYPgESlwr
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో 1963లో జన్మించారు. వల్లంకి తాళం పేరుతో చేసిన కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 2020-21 ఏడాదికి గాను ప్రకటించిన ఈ అవార్డును వెంకన్న శుక్రవారం అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకోవడానికి శుక్రవారం ఢిల్లీ వెళ్లిన గోరటి వెంకన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతోనే భేటీ అయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ అధికారిక నివాసానికి వెళ్లిన వెంకన్న న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు.

గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం కవిత సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు అందుకున్న గోరటి వెంకన్న అన్నారు. గతంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ చేతులమీదుగా అవార్డు కూడా తీసుకున్నారు. ఇవాళసుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉండి వారు నన్ను పిలిచి అభినందించటం మాటల్లో చెప్పలేనిది అని సంతోషం వ్యక్తం చేశారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications