జూమ్ లైవ్ మీటింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగి రాసలీలు... కెమెరా ఆఫ్ అయిందనుకుని...

టెక్నాలజీ మీద సరైన అవగాహన లేని ఓ ప్రభుత్వ ఉద్యోగి తన సెక్రటరీతో శృంగారంలో పాల్గొంటూ అడ్డంగా దొరికిపోయాడు. ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన జూమ్ ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్న అతను... తనవంతు అయిపోగానే దాన్ని క్లోజ్ చేయకుండా అలాగే వదిలేశాడు. ఆపై అదే గదిలో తన సెక్రటరీతో శృంగారంలో పాల్గొనడంతో అదంతా జూమ్ లైవ్‌లో రికార్డయింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు అతనిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్నారు.

కెమెరా ఆఫ్ అయిందనుకుని...

కెమెరా ఆఫ్ అయిందనుకుని...

ఫిలీప్పీన్స్‌కి చెందిన జీసస్ ఎస్టిల్ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఈ నెల 26న విలేజ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన జూమ్ ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్నాడు. అధికారులతో పలు అంశాలపై మాట్లాడిన అతను... తనవంతు ముగియగానే... అక్కడి నుంచి లేచాడు. ల్యాప్‌టాప్ ఎదురుగా ఉన్న సోఫా వద్దకు వెళ్లి... అక్కడే ఉన్న సెక్రటరీ ఫాతిమాతో శృంగారంలో పాల్గొన్నాడు. తనవంతు అయిపోగానే కెమెరా ఆటోమెటిగ్గా ఆఫ్ మోడ్‌లోకి వెళ్లిందనుకున్నాడు. జూమ్ యాప్ గురించి అంతగా అవగాహన లేకపోవడంతో... కెమెరాను ఆన్‌లోనే ఉంచి చేయాల్సిందంతా చేశాడు.

లీకైన వీడియో...

లీకైన వీడియో...

జూమ్ లైవ్‌లో రికార్డయిన ఆ వీడియో ఇటీవల బయటకు లీకై వైరల్‌గా మారింది. దీనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఎస్టిల్‌పై వేటు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఇది మామూలు తప్పిదం కాదని... క్షమించరాని తప్పిదమని పేర్కొన్నారు. సహజంగానే అతను క్షమాపణ కోరుతాడని... కానీ అతనికి కఠిన శిక్ష తప్పదని అన్నారు.ఫాతిమా కూడా ప్రభుత్వ ఉద్యోగే అని అన్న కథనాలు వస్తున్నాయి. ఈ వీడియో లీకైనప్పటి నుంచి ఆ ఇద్దరూ తమ కార్యాలయంలో రిపోర్ట్ చేయలేదు.

Recommended Video

    Lockdown : India Plans To Bring Back Over 14,000 Stranded Indians In 64 flights | Oneindia Telugu
    మెక్సికోలోనూ ఇలాంటి తరహా ఘటన

    మెక్సికోలోనూ ఇలాంటి తరహా ఘటన

    గత జూన్ నెలలో మెక్సికోలో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది. జూమ్ లైవ్‌లో ఓ పొలిటీషియన్ తన దుస్తులు మార్చుకుంది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అయితే అది పొరపాటున జరిగిందని ఆమె వివరణ ఇచ్చుకుంది. 'నేను 66 ఏళ్ల మహిళను. నలుగురు పిల్లల తల్లిని. అందులో ముగ్గురు ఇప్పుడు వివిధ రంగాల్లో ప్రొఫెషనల్స్‌గా స్థిరపడ్డారు. నేను దాదాపు 40 ఏళ్లు మానవ హక్కుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాను. నేను నా శరీరం గురించి సిగ్గుపడట్లేదు. నేను నా శరీరాన్ని ప్రేమిస్తాను. ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్..' అంటూ వివరణ ఇచ్చుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+