Teacher: ప్రభుత్వ స్కూల్లో టీచర్, కోట్లలో చీటీల వ్యాపారం, రాత్రి బయటకు వెళ్లాడు, కారు షెడ్ లో శవం !
మైసూరు/బెంగళూరు: ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయన భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. ప్రభుత్వ టీచర్ దగ్గర చాలా మంది చీటీలు వేశారు. ప్రతినెల కోట్లాదిరూపాయల చీటీల వ్యవహారం నిర్వహిస్తున్న ప్రభుత్వ స్కూల్ టీచర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల టీచర్ ఇంటికి వెళ్లిన నిందితులు దంపతులు కాళ్లు, చేతులు కట్టేసి ఇల్లు లూటీ చేశారు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఎప్పటిలాగా స్కూల్ కు వెళ్లిన టీచర్ సాయంత్రం ఇంటికి వెళ్లాడు. రాత్రి పని ఉందని బయటకు వెళ్లిన టీచర్ తరువాత ఇంటికి చేరుకోలేదు. ఉదయం కారు షెడ్ లో టీచర్ ఉరికి వేలాడుతు శవమై కనిపించడం కలకలం రేపింది.

ప్రభుత్వ స్కూల్ లో టీచర్
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలో రామస్వామి లేఔట్ లో శుంభులింగ (47) అనే ఆయన నివాసం ఉంటున్నాడు, కొన్ని సంవత్సరాల క్రితం శుంభలింగ ధాక్షాయణి అనే మహిళున వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న శంభులింగ ఆయన భార్య ధాక్షాయణి, పిల్లలతో కలసి చాలా సంతోషంగా జీవిస్తున్నాడు.

రూ. కోట్లలో చీటీల వ్యాపారం
ప్రభుత్వ టీచర్ శుంభలింగ దగ్గర నంజనగడూతో పాటు ఆ పట్టణం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వందలాది మంది చీటీలు వేశారు. శంభులింగ ప్రతినెల కోట్లాదిరూపాయల చీటీల వ్యవహారం నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ టీచర్ శంభులింగ చీటీలు వేసిన వారికి ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు.

కోరియర్ పేరుతో ఇల్లు లూటీ
నెల రోజుల క్రితం టీచర్ శంభులింగ ఇంటికి కోరియర్ పార్శిల్ ఇచ్చే ముసుగులో వెళ్లిన నిందితులు శంభులింగ, ధాక్షాయణి దంపతులు కాళ్లు, చేతులు కట్టేసి ఇంటిలో ఉన్న బంగారు నగలు, నగదు లూటీ చేశారు. శంభులింగ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

కారు షెడ్ లో శవమైన టీచర్
ఎప్పటిలాగా గురువారం ఉదయం స్కూల్ కు వెళ్లిన టీచర్ శంభులింగ సాయంత్రం ఇంటికి వెళ్లాడు. గురువారం రాత్రి పని ఉందని బయటకు వెళ్లిన శంభులింగ తరువాత ఇంటికి చేరుకోలేదు. శుక్రవారం ఉదయం ఇంటి ఆవరణంలోని కారు షెడ్ లో టీచర్ శంభులింగ ఉరికి వేలాడుతు శవమై కనిపించడం కలకలం రేపింది. ఆర్థిక సమస్యల కారణంగా ప్రభుత్వ టీచర్ శంభులింగ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications