హెచ్చరికే: నెస్లేపై రూ. 640 కోట్లకు కేంద్రం దావా
న్యూఢిల్లీ: అక్రమ వ్యాపార పద్ధతులను పాటించినందుకు, వినియోగదారులను మోసగించేలా ప్రకటనలు ఇచ్చినందుకుగాను పరిహారం కింద రూ.640 కోట్లు చెల్లించాలంటూ మ్యాగీనూడుల్స్ తయారీసంస్థ నెస్లే ఇండియాపై కేంద్రప్రభుత్వం దావా వేసింది.
వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రకారం ఈ మొత్తం ఇప్పించాలంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ)లో మంగళవారం కేసు దాఖలు చేసింది. దాదాపు 30ఏళ్ల 'వినియోగదారుల పరిరక్షణ చట్టం' చరిత్రలో ఒక కంపెనీపై ఈ విధంగా దావా వేయటం ఇదే తొలిసారి.
కేసు దాఖలు చేసిన విషయాన్ని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్ ధృవీకరించారు. ఎంత పరిహారం కోరారన్నది మాత్రం ఆయన తెలియజేయలేదు. కాగా, రూ.640 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లుగా అధికారవర్గాలు వెల్లడించాయి.

'వినియోగదారుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా భారతదేశంలో నాసిరకం ఉత్పత్తులను విక్రయించే కంపెనీలకు గట్టి సందేశం ఇవ్వటానికే నెస్లేపై ప్రభుత్వం ఈ కేసు దాఖలు చేసింది'అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై తమకు ఇంతవరకూ ఎటువంటి సమాచారం అందలేదని నెస్లేఇండియా అధికారప్రతినిధి పేర్కొన్నారు.
మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో శివార్లలోని ఒక గోడౌన్‌లో 20,000 కిలోల మ్యాగీనూడుల్స్‌ను 'భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికారిక సంస్థ' అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఇవి అమ్మకానికి ఉద్దేశించినవి కావని, మార్కెట్ నుంచి వెనక్కితెస్తున్న నూడుల్స్ అని నెస్లే పేర్కొంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications