బాణాసంచా బ్యాన్ చేసిన ప్రభుత్వాలు, ఏ రాష్ట్రాలు చేశాయంటే ?, కాల్చినా, పేల్చినా బ్యాండ్ బజావ్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: దీపావళి పండుగ సమీపిస్తోంది. పటాకుల విక్రయం, వినియోగంపై చర్చలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి కర్ణాటక డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ జారీ చేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్క్యులర్ బాణాసంచా అమ్మకాలు, వినియోగాన్ని బ్యాన్ చేస్తున్నామని, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు చేస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం జీవో జారీ చేసింది.

కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సెక్రటరీ నుండి ఒక లేఖ విడుదల చేశారు. దీపావళి వేడుకల సందర్భంగా వివిధ రకాల బాణాసంచా పేల్చడం వల్ల కలిగే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడకుండా ఉండేందుకు కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సర్క్యులర్‌లో మార్గదర్శకాలను జారీ చేసింది.

Governments have banned the sale of crackers in five states including Karnataka on the occasion of Diwali

సుప్రీం కోర్ట్ రిట్ పిటీషన్ నం: 728/ 1998 ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాలలో శబ్దం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలిలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, స్థానిక సంస్థల అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను తమ కిందిస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కర్ణాటక రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు. స్థానిక సంస్థల అధికారులు, ఆరోగ్య అధికారులు, తహసీల్దార్లు, జిల్లా పర్యావరణ విభాగం అధికారులు, పోలీసు అధికారులు, సంబంధిత పౌరులు, స్థానిక ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తమ పరిధిలోని అన్ని బాణసంచా విక్రయదారుల గోదాములను పరిశీలించి, అక్కడ పచ్చి పటాకులు కాకుండా నిషేధిత పటాకులు నిల్వ ఉంచినట్లయితే, మొత్తం గోదాంను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకతో పాటు న్యూఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ప్రమాదకరమైన కాలుష్యం ఎక్కువగా ఉన్న బాణాసంచాను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+