సంక్షోభానికి తెర: తమిళ సీఎంగా పళని, బలనిరూపణకు 15రోజులు

శశికళ స్థానంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామికి రాజ్‌భవన్‌ నుంచి పిలుపొచ్చింది

చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం సాయంత్రం ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠంపై పళనిస్వామి కూర్చోవడం లాంఛనంగా మారింది.

గత రెండు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు గవర్నర్ నిర్ణయంతో తెరపడినట్లయింది. అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మధ్య సాగిన పోరు.. సుప్రీంతీర్పుతో శశికళ జైలుకు వెళ్లడంతో ముగిసింది.

అయితే, ఆమె శాసనసభ పక్షనేతగా పళనిస్వామిని ప్రకటించడంతో మరోసారి రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తనకు మద్దతుందని పన్నీరుసెల్వం ప్రకటించినప్పటికీ.. 124మంది ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామినే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించడంతో రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లయింది. కాగా, బలనిరూపణకు పళనిస్వామికి గవర్నర్ 15రోజుల గడువిచ్చారు గవర్నర్ విద్యాసాగర్ రావు.

అంతకుముందు జరిగిన పరిణామాలు

గవర్నర్‌తో ముగిసిన పళనిస్వామి భేటీ: కాసేపట్లో నిర్ణయం, సా. 4.30కు సీఎంగా ప్రమాణం

గవర్నర్ పిలుపు మేరకు పళనిస్వామి తన మద్దతుదారులతో కలిసి రాజ్ భవన్ చేరుకన్నారు.
పళనిస్వామి వెంట సెంగొట్టియ్యన్, దిండిగల్ శ్రీనివాస్, సీవీ షన్ముగం, దినకరణ్, తంగమణి, వేలుమణి ఉన్నారు.124మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని గవర్నర్ కు చెప్పారు.

సుమారు 15నిమిషాలపాటు గవర్నర్‌తో పళనిస్వామి బృందం భేటీ అయ్యింది. కాసేపట్లో గవర్నర్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 4.30గంటలకు పళనిస్వామి సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

governor calls Palaniswamy to meet him

గవర్నర్ పిలుపు

తమిళనాడులో గత కొంతకాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం పదవి కోసం పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం పోటీ పడుతున్న నేపథ్యంలో గురువారం ఇంఛార్జీ గవర్నర్‌ విద్యాసాగర్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో శశికళ స్థానంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామికి రాజ్‌భవన్‌ నుంచి పిలుపొచ్చింది. గురువారం ఉదయం 11.30 గంటలకు పళనిస్వామికి గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+