లిఫ్టులో చిక్కుకున్న గవర్నర్: బెండ్ తీశారు

ఈటానగర్: ఓ రాష్ట్రానికి గవర్నర్ అయిన ఆయన లిఫ్టులో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మూడు నిమిషాల పాటు అక్కడే చిక్కుకున్నారు. తరువాత బయటకు వచ్చిన గవర్నర్ విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి చివాట్లు పెట్టారు.

ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూసింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ. రాజ్ ఖోవా సోమావారం రాజ్ భవన్ లోని లిఫ్టులో బయలుదేరారు. ఆ సందర్బంలో ఆయనతో పాటు వ్యక్తిగత కార్యదర్శి లిఫ్టులో ఉన్నారు.

అయితే మద్యలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లిఫ్టు ఆగిపోయింది. గవర్నర్ రాజ్ ఖోవా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ సందర్బంలో గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి ఫోన్లు చేసి చెప్పడంతో విద్యుత్ సరఫరా చేశారు.

Governor JP Rajkhowa was stuck in a lift in Arunachal Pradesh

లిఫ్టులో ఫ్యాన్, లైట్ లేకపోవడంతో గవర్నర్ ఉక్కిరిబిక్కిరి అయ్యారని రాజ్ భవన్ వర్గాలు ఒ ప్రకటనలో తెలిపారు. సాక్షాత్తు గవర్నర్ కే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.

విద్యుత్ శాఖ అధికారులను రాజ్ భవన్ కు పిలిపించి చివాట్లు పెట్టి పంపించారు. అరుణాచల్ ప్రదేశ్ లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్థంగా ఎందుకు ఉందని అని ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ సరఫరా సవ్యంగా జరగడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+