సామాన్యుడిపై అదనపు భారం: పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు.. లీటరుకు ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీ: కేంద్రం మరోమారు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. లీటరు పెట్రోలు డీజిల్ పై రూ. 3 పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పతనం కావడంతోనే ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతోంది.ఇక పెట్రోల్ పై ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.2 నుంచి రూ.8వరకు పెంచగా.. లీటర్ డీజిల్‌పై రూ.4 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇక దీనికి అదనంగా రోడ్ సెస్ కూడా పెంచింది కేంద్రప్రభుత్వం. లీటర్ పెట్రోల్‌పై రూ.1 పెంచగా అదే లీటర్ డీజిల్‌పై రోడ్ సెస్ రూ. 10వరకు పెంచింది. ఇక ఎక్సైజ్ సుంకంను పెంచిందంటే పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోతాయనే సంకేతాలు ఇచ్చింది కేంద్రం.

అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో తప్పని పరిస్థితుల్లో కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చిందని అయితే ముడిచమురు ధరలు సాధారణ స్థితికి చేరుకోగానే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గుముఖం పడుతాయని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెబుతున్నారు.
Recommended Video

ఇదిలా ఉంటే పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం చర్యను తప్పుబట్టాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైన వేళ దేశంలోని సామాన్యుడిపై కేంద్రం అదనపు భారం వేస్తోందని విమర్శించారు కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరి. ఇప్పటికే కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని గుర్తు చేసిన సీతారాం ఏచూరి... యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలైమందన్నారు. మరోవైపు ప్రభుత్వంకు అనుకూలంగా ఉండే వారి రుణాలను మాఫీ చేస్తున్న ప్రభుత్వం... ఇతర సామాన్య ప్రజలపై మాత్రం ఇలా పెట్రోలు డీజిల్ ధరలు పెంచి భారం మోపుతోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications