ప్రభుత్వం మీ ఫ్రెండ్: దళిత కమ్యూనిటీతో ప్రధాని

న్యూఢిల్లీ: భారతరత్న డాక్టర్. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదని, ఆయనో గొప్ప ఆర్థిక వేత్త అని ప్రధాని మోడీ అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ వ్యవస్థాపకుల జాతీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రధాని మోడీ మంగళవారం మాట్లాడారు.

ఈ సందర్భంగా మోడీ 'ఉద్యోగాల సృష్టికర్తలను తయారు చేయాలనుకుంటున్నాం, ఉద్యోగాల కోసం ఎదురుచూసేవాళ్లను కాదు' అని అన్నారు. నిరుపేదలను ఆర్ధికంగా బలవంతులను చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో దళిత పారిశ్రామిక వేత్తల పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

 Govt is your friend: PM Modi assures Dalit community

దళిత మహిళలు కూడా పారిశ్రామిక రంగంపై దృష్టి సారించాలన్నారు. పారిశ్రామికీకరణతో దళితులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న బీఆర్ అంబేడ్కర్ వ్యాఖ్యలు నిజమని అన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా 80 లక్షల మంది ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని పేర్కొన్నారు. వీరిలో ఎక్కువమంది దళితులు, గిరిజనులు, ఓబీసీలని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+