ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలపై ఫిర్యాదులు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లిప్‌కార్ట్' దసరా పండగ నేపథ్యంలో ప్రవేశపెట్టిన డిస్కౌంట్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారని, దీనిపై తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నామని ఒక వేళ ప్రత్యేక విధానం లేక ఈ-కామర్స్ రిటైల్ వ్యాపారంపై స్పష్టత అవసరమా? అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.

‘బిగ్ బిలియన్ డే' స్కీం పేరుతో ఫ్లిప్ కార్ట్ ఇటీవల ఇచ్చిన ఆఫర్ డిస్కౌంట్‌కు 1.5 మిలియన్ల మంది తమ పోర్టల్‌లో షాపింగ్ చేశారని, పది గంటల్లో రూ. 600 కోట్లకు పైగా ఉత్పత్తులు అమ్ముడయ్యాయని సదరు సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతేగాక బిగ్ బిలియన్ డే ద్వారా వినియోగదారులను సంతృప్తి పరచడంలో విఫలమయ్యామని, అనుకున్నస్థాయిలో పనితీరును కనబర్చలేకపోయామని ప్లిఫ్‌కార్డ్ అంగీకరించింది. ఇందుకుగాను ప్రతి ఒక్క వినియోగదారుడికి క్షమాపణ చెబుతున్నట్లు తెలిపింది. మరోసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించదలిస్తే పూర్తి సన్నద్దతతో చేస్తామని హామీ ఇచ్చింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications