వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Today In Parliament : మూడు బిల్లులకు ఆమోదం - తీర్మానాలపై చర్చ : రైల్వే పై స్టేట్ మెంట్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ లో ఎనిమిదవ రోజున పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తెచ్చేందుకు సిద్దమైంది. దీంతో పాటు తీర్మానాలు.. చర్చల నిర్వహణ దిశగా బిజినెస్ ఖరారైంది. ఈ రోజు జరిగే సమావేశాల్లో రాజ్యసభలో మరోసారి 12 మంది సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత పైన విపక్షాలు పట్టు బట్టే అవకాశం ఉంది. ఇప్పటికే తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనుందుకు నిరసనగా.. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ను బహిష్కరించారు. ఇక, ఈ రోజు జరిగే సమావేశాల్లో ముందుగా ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. ఆ తరువాత మంత్రులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందు ఉంచనున్నారు.

ఇక, వీటితో పాటుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సులకు సంబంధించిన నివేదికలు సైతం సభ ముందుకు రానున్నాయి. అందులో ప్రధానంగా రక్షణ శాఖకు బడ్జెట్ అంశం పైన కమిటీ నివేదిక సమర్పించింది. ఇక, రైల్వే స్టేషన్లు ఆధునీకరణ...ప్రయాణీకుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. పరిశ్రమలు..వాణిజ్యం పైన ఆ శాఖ మంత్రి సభలో స్టేటమెంట్ ఇవ్వనున్నారు. ఈ నెల 7వ తేదీన లోక్ సభలో ప్రవేశ పెట్టిన సుప్రీం - హై కోర్టు న్యాయమూర్తులు వేతనాలు..సర్వీసు సంబంధించిన బిల్లును ఆమోదం కోసం ప్రతిపాదించనున్నారు.

Govt take up three bills for consideration and passing in Parliament to day

Recommended Video

Parliament Winter Session 2021 : Opposition Walk Out | Crypto | NRC || Oneindia Telugu

ఇక, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ డాం సేఫ్టీ బిల్లును ఆమోదం కోసం సభ ముందు కోరనున్నారు. ఈ బిలుల్లో రాజ్యసభ కొన్ని సవరణలు సూచించింది. వీటిని సవరిస్తూ ఈ బిల్లు ఆమోదం కోసం సభను కోరనున్నారు. ఈ బిల్లు సైన చర్చ సమయంలో కేంద్ర మంత్రి ఏపీలో తాజాగా వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. దీని పైన ఏపీ మంత్రి సైతం గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇక, సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ 2003 లో సవరణలతో మరో బిల్లును సభ ఆమోదం కోసం ప్రతిపాదించనున్నారు. ఇక, రెండు కీలక తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం పైన సవరణలతో కూడిన బిల్లుకు ఈ రోజు సభలో ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. ఇక, రూల్ 193 కింద వాతావరణ మార్పుల పైన స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

English summary
Three ky bills proposed to day in loksabha for consideration and passing . Two resolutions may come to house as part of to day business
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X