Grand Entry: గాలి జనార్దన్ రెడ్డి కొడకు ఎంట్రీ, రాజమౌళి ఆశీర్వాదం, బాహుబలి టీమ్, సినిమాలో !

బెంగళూరు/ హైదరాబాద్: కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గురించి కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పనవసరం లేదు. కర్ణాటకలో గతంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం అయిన నాయకుల్లో గాలి జనార్దన్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. తరువాత అక్రమ మైనింగ్ కేసుల్లో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు, హైదరాబాద్ అల్లుడు గాలి కిరీటి ఇప్పుడు హీరోగా సినిమా రంగంలో అతని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. భారతదేశం గర్వించదగిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా క్లాప్ కొట్టి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటిని సినిమా రంగానికి పరిచయం చేశారు. బాహుబలి టీమ్ కూడా ఈ సినిమాకు పని చేస్తోంది.

తనకు తెలుగులో జూనియర్ ఎన్ టీఆర్, కన్నడలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆదర్శమని, ఆ ఇద్దరు హీరోలు అంటే తనకు ఎంతో ఇష్టమని గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి మొహమాటం లేకుండా చెప్పారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రరంగానికి చెందిన ప్రముఖ నటీనటులు అందరూ ఈ ద్విబాషా చిత్రంలో నటిస్తున్నారు. సంచలన సినిమాలు తెరకెక్కించిన వారాహి ప్రోడెక్షన్ అధినేత సాయి కోర్రపాటి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటిని సినిమా రంగానికి పరిచయం చెయ్యడం ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు, కన్నడ బాషల్లో గాలి కిరీటి సినిమా తెరకెక్కుతోంది.

 మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి

మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి

కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గురించి కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పనవసరం లేదు. కర్ణాటకలో గతంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం అయిన నాయకుల్లో గాలి జనార్దన్ రెడ్డి కీలకపాత్ర పోషించారు.

 రాజకీయాలకు దూరం అయిన గాలి జనార్దన్ రెడ్డి

రాజకీయాలకు దూరం అయిన గాలి జనార్దన్ రెడ్డి

తరువాత అక్రమ మైనింగ్ కేసుల్లో అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే పరోక్షంగా తనను నమ్ముకున్న వారికి సహాయం చెయ్యడానికి గాలి జనార్దన్ రెడ్డి టచ్ లోనే ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు ఇద్దరు ఇప్పుడు కర్ణాటకలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలు, గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములు కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు.

 ఎస్ఎస్ రాజమౌళి ఆశీర్వాదంతో హీరోగా గాలి కిరీటి ఎంట్రీ

ఎస్ఎస్ రాజమౌళి ఆశీర్వాదంతో హీరోగా గాలి కిరీటి ఎంట్రీ

కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు, హైదరాబాద్ అల్లుడు గాలి కిరీటి ఇప్పుడు హీరోగా సినిమా రంగంలో అతని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. భారతదేశం గర్వించదగిన దర్శక ధీరుడు, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా క్లాప్ కొట్టి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటిని సినిమా రంగానికి పరిచయం చేశారు.

 బాహుబలి టీమ్

బాహుబలి టీమ్

గాలి కిరీటి నటిస్తున్న ఈ ద్విబాష చిత్రానికి బాహుబలి సినిమా ఫోటోగ్రాఫర్ సెంథిల్ ఈ సినిమాకు చాయాగ్రహణం అందిస్తున్నారు, దేవశ్రీ ప్రసాద్ (DSP) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫూట్ మాస్టర్. ఇలా పలు రంగాల్లోని ప్రముఖులు గాలి కిరీటి ద్విబాషా సినిమాకు పని చేస్తుండటంతో కన్నడ, తెలుగు పరిశ్రమాలో హాట్ టాపిక్ అయ్యింది.

 రజనీకాంత్, చిరంజీవి, నాగార్జునను హ్యాండిల్ చేసిన స్టార్ హీరో

రజనీకాంత్, చిరంజీవి, నాగార్జునను హ్యాండిల్ చేసిన స్టార్ హీరో

చిరంజీవి, రజనీకాంత్, అక్కినేని నాగార్జున తదితర హీరోలతో కలిసి నటించి దర్శకత్వం కూడా చేపట్టిన కన్నడ స్టార్ హీరో క్రేజీ రవిచంద్రన్, బహుబాష నటి కుష్బు, జూనియర్ ఎన్ టీర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాణా, రామ్, మంచు విష్ణు, సుమంత్ లాంటి స్టార్ హీరోలతో నటించి తరువాత మాజీ సీఎం కొడుకు, నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుని 10 ఏళ్లు సినిమాలకు దూరం అయిన జెనీలియా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

 తెలుగులో జానీయర్ ఎన్ టీఆర్, కన్నడలో పవర్ స్టార్

తెలుగులో జానీయర్ ఎన్ టీఆర్, కన్నడలో పవర్ స్టార్

తనకు తెలుగులో జూనియర్ ఎన్ టీఆర్, కన్నడలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆదర్శమని, ఆ ఇద్దరు హీరోలు అంటే తనకు ఎంతో ఇష్టమని గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి మొహమాటం లేకుండా చెప్పారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రరంగానికి చెందిన ప్రముఖ నటీనటులు అందరూ ఈ ద్విబాషా చిత్రంలో నటిస్తున్నారు.

కర్ణాటకలో హాట్ టాపిక్

కర్ణాటకలో హాట్ టాపిక్

సంచలన సినిమాలు తెరకెక్కించిన వారాహి ప్రోడెక్షన్స్ అధినేత సాయి కోర్రపాటి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటిని సినిమా రంగానికి పరిచయం చెయ్యడం ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, కన్నడ బాషల్లో గాలి కిరీటి రెడ్డి అలియాస్ కిరీటి సినిమా తెరకెక్కుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+