రోడ్డు ప్రమాదం: భగత్ సింగ్ మునిమనవడు మృతి
సిమ్లా: భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ముని మనవడు అభితేజ్ సింగ్ సంధు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. హిమాచల్ ప్రదేశ్‌లో రామ్‌పూర్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అభితేజ్ సింగ్(27).. తన మిత్రుడు సనావార్‌తో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. వీరి వెనకాలే గురుపాల్ సింగ్, అభితేష్ కారులో ప్రయాణమయ్యారు. రామ్‌పూర్ సమీపంలో మ్యాంగ్లాడ్ వద్ద బైక్ అదుపు తప్పింది. బైక్‌పై వెళ్తోన్న అభితేజ్, సనావార్ కిందపడ్డారు.

దీంతో సనవార్‌కు స్వల్ప గాయాలు కాగా, అభితేజ్‌కు మాత్ర తల, పక్కటెముకల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రామ్‌పూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొన్ని నిమిషాల్లోనే అతడు చనిపోయాడు. రోడ్డు తడిగా ఉండటంతో బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అభితేజ్ స్నేహితులు తెలిపారు.
పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. మోహాలీలో సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని పోలీసులు తెలిపారు. కాగా, కులమ, మత రాజకీయాలను అభితేజ్ వ్యతిరేకించే వారని, భగత్ సింగ్ మార్గంలోనే పోరాటం కొనసాగించేవారని స్నేహితులు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్.. అభితేజ్ మృతికి సంతాపం ప్రకటించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications