తల్లి పాడుబుద్ధి: తన ప్రియుడితో బిడ్డ పెళ్లికి ప్లాన్
చెన్నై: ఓ తల్లికి పాడుబుద్ది పుట్టుకొచ్చింది. తన కన్నకూతురినే తాను అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నించింది. అది కూడా మెనారిటీ తీరని తన 15 కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. ఆయితే ఆమె పాడు బుద్ధిని బాలిక అమ్మమ్మ తీవ్రంగా వ్యతిరేకించి, పోలీసులకు సమాచారమిచ్చింది.
దీంతో ఆ మహిళ దుర్బుద్ధికి సంబంధించిన వ్యవహారం బయటపడింది. చెన్నైలో కళా అనే మహిళ భర్త చనిపోవడంతో మణికందన్ (40) అనే కన్‌స్ట్రక్షన్ సూపర్‌వైజర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. నాలుగేళ్లుగా వీరి వ్యవహారం సాగుతోంది. కళా తల్లి అమరావతి (65) కూతురిని వారించడానికి ప్రయత్నించింది.

అయినా కళా చేస్తున్న తప్పుడు పనిని సమర్థించుకుంది. కళాకు 15 ఏళ్ల వయస్సు గల కూతురుంది. ఆమె స్కూల్ మానుకుని ఇంటి దగ్గర ఖాళీగా ఉంటుంది. ఆమెపై మణికందన్ కన్నుపడింది. ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని కళాతో చెప్పాడు. కళా కూడా డబ్బు కోసం మణికందన్ నిర్ణయాన్ని అంగీకరించింది.
ఈ విషయాన్ని కళా తన తల్లితో చెప్పింది. ఆమె కూతురు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ బాలికతో కలిసి వెళ్లి మెదవక్కమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కళా, మణికందన్‌ల వ్యవహారం గత నాలుగేళ్లుగా నడుస్తోందని, అది అమరావతికి నచ్చలేదని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications