రేప్ చేశారు: గ్రీన్ పీస్ మాజీ ఉద్యోగిని ఆరోపణ
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వేతర సంస్థ గ్రీన్ పీస్ ఇండియాలో లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. బాధితురాలు ఏకంగా తన మీద జరిగిన వేధింపుల గురించి ఒక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు పోందుపరిచింది.
కళ్లు తెరిచిన గ్రీన్ పీస్ ఇండియా నిర్వహకులు యువతికి న్యాయం చేస్తామని, పోలీసుల చేత దర్యాప్తు చేయిస్తామని అంటున్నారు. వివరాలలోకి వెళితే 2013లో ఒక యువతి గ్రీన్ పీస్ సంస్థలో ఉద్యోగంలో చేరింది. తరువాత సీనియర్లు ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు.

చివరికి ఆమె తనమీద అత్యాచారం చేశారని ఆరోపిస్తున్నది. ఈ విషయం సంస్థ నిర్వహకులతో పాటు హెచ్ ఆర్ మేనేజర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని భాధితురాలు ఆరోపించారు. ఈ సంస్థ నిబంధనలు పాటించడం లేదని తెలుసుకున్న ప్రభుత్వం వారి ఖాతాలను స్థంభింపచేసింది.
తరువాత సీనియర్లు తనను నిందించారని, నిత్యం సూటిపోటిమాటలతో వేధించారని, చివరికి ఫలితం లేదని తాను ఆ సంస్థలో ఉద్యోగం నిలిపి వేశానని బాధితురాలు ఆరోపిస్తున్నారు. విషయం బయటకు రావడంతో గ్రీన్ పీస్ ఇండియా నిర్వహకులు ఉలిక్కి పడ్డారు.
యువతి చేసిన ఆరోపణల మీద దర్యాప్తు చేయిస్తామని గ్రీన్ పీస్ ఇండియా ప్రోగాం డైరెక్టర్ దివ్య రఘునందన్ అంటున్నారు. అయితే యువతికి జరిగిన అన్యాయం పై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని పలు స్వచ్చంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications