Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారు, వరుడు మైనర్ అంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు

అబ్బాయికి 18 ఏళ్ళు, అమ్మాయికి 24 ఏళ్ళు, వారిద్దరూ ఇష్టపడ్డారు. దీంతో పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అమ్మాయికి, అబ్బాయికి ఏకంగా ఆరేళ్ళ తేడా ఉండడంతో వరుడి బంధువులు ఈ పెళ్ళికి ఇష్టపడలేదు.

మైసూర్:అబ్బాయికి 18 ఏళ్ళు, అమ్మాయికి 24 ఏళ్ళు, వారిద్దరూ ఇష్టపడ్డారు. దీంతో పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అమ్మాయికి, అబ్బాయికి ఏకంగా ఆరేళ్ళ తేడా ఉండడంతో వరుడి బంధువులు ఈ పెళ్ళికి ఇష్టపడలేదు. దీంతో ప్రేమికులు దేవాలయంలో పెళ్ళి చేసుకొన్నారు.

మైసూర్ లోని మోహల్లాకు చెందిన ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ఒకేచోట పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.కొద్దికాలం సరదాగా తిరిగారు.

ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసింది. కనీస వివాహ వయస్సు కూడ రాని అబ్బాయికి వివాహం చేయబోమని తేల్చిచెప్పారు. అయితే పెద్దలు ఈ పెళ్ళికి అంగీకరించబోరని భావించిన ప్రేమికులు పెళ్ళి చేసుకొన్నారు.

Groom parents complaint against bride to police

ఆదివారం నాడు స్థానికంగా ఉన్న సయ్యాజీరావు రోడ్డులోని సత్యనారాయణరావు ఆలయంలో దండలు మార్చుకొని వివాహం చేసుకొన్నారు.

దీంతో వరుడి తల్లిదండ్రులు , బంధువులు వచ్చి తమ కుమారుడు మైనర్ అని, అతడికి బలవంతంగా పెళ్ళి చేశారని మండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమికులను పిలిపించి విచారణ చేశారు.అయితే తమ ఇష్టప్రకారంగానే పెళ్ళి చేసుకొన్నట్టు ప్రేమికులు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+