మొదటి భార్య రాక: వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు

సాగర్: తనకు వివాహం కాలేదని నమ్మించి మరో వివాహానికి సిద్ధమైన యువకుడి బండారం బయట పడడంతో వివాహ వేదికపైనే వధువు అతడి చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సాగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

సాగర్‌లో జరుగుతున్న సామూహిక వివాహ వేడుకలో ఖేమ్‌చంద్‌ పాటిల్‌ అనే వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు పీటలపై కూర్చున్నాడు. వీరి జంటతో పాటు మరికొన్ని జంటలు కూడా పెళ్లి పీటలెక్కాయి.

అందరూ పెళ్లిళ్ల హడావుడిలో ఉండగా ఓ మహిళ వేదిక వద్దకు వచ్చి ఖేమ్‌చంద్‌ తన భర్త అని, గతంలోనే తమకు వివాహం జరిగిందని చెప్పింది. అంతేగాక, సాక్ష్యంగా పెళ్లి సర్టిఫికేట్‌ కూడా చూపించింది. దీంతో వరుడికి, సదరు మహిళకు మధ్య వాగ్వాదం తీవ్ర వాగ్వాదం జరిగింది.

Groom slapped by ex-girlfriend in front of guests; bride weds his younger brother

తనను మోసం చేశాడని తెలుసుకున్న వధువు కోపంతో వేదిక వద్దే అందరి ముందు ఖేమ్‌చంద్ పాటిల్‌ చెంప చెళ్లుమనిపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఖేమ్‌చంద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తరాఖండ్‌లోనూ చోటు చేసుకుంది. ఇక్కడ పెళ్లి పీటలపైనే వరుడి చెంప చెళ్లుమనింపించి అతని ప్రియురాలు. దీంతో పెద్దల సూచన మేరకు వధువు వరుడి సోదరుడ్ని వివాహం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+