Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రాఫిక్ లో చిక్కుకున్న వరుడు.. ట్విస్ట్ అదుర్స్ కదూ..

పెళ్లంటే నూరేళ్ల పంట.. అందుకే ముహూర్తాలు అన్నీ సరిగ్గా చూసి నిమిషాలు,సెకన్లతో కలిపే పెళ్లి టైమ్ ఫిక్స్ చేస్తారు పురోహితులు. అదే వివాహానికి పెళ్లికొడుకే టైమ్ కు రాకపోతే.. ? అలాంటి సమస్యే ఓ వరుడికి ఎదురైంది. ఆ వరుడు కారులో పెళ్లి మండపానికి వెళ్తుండగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఓ పక్క ముహూర్తం దగ్గరపడుతోంది. మరో పక్క ఎదురుగా వందల కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? అని ఆలోచించిన ఆ వరుడు.. ఇక లాభం లేదని కాళ్లకు పనిచెప్పాడు. కార్ల మధ్యలో పరిగెత్తుకుంటూ వరుడు కల్యాణ మండపానికి చేరుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను శౌర్యా దవార్ అనే వ్యక్తి ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 25 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "బ్రో స్టే సింగిల్.. స్టే సేఫ్" అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రేమికులకు అతిపెద్ద శత్రువు ట్రాఫిక్ అని మరొక వ్యక్తి కామెంట్స్ చేశాడు. మరికొంతమంది ఈ వీడియోను తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కు షేర్ చేస్తున్నారు. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

Groom Stuck in Traffic Walks to Wedding Hall Video Goes Viral

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+