పెళ్లి కోసం పాట్లు: మంచు తుఫానులో వరుడు, అతని ఫ్యామిలీ 6 కిలోమీటర్లు నడిచింది
డెహ్రాడూన్: ఓ పెళ్లి కుమారుడు, వారి కుటుంబం పెళ్లి వేడుకకు చేరుకునేందుకు జోరుగా కురుస్తున్న మంచులో దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. మంచు కారణంగా వారు వెళ్తున్న వాహనాలు ఆగిపోయాయి. పెళ్లిని వాయిదా వేసే పరిస్థితి లేదు. దీంతో నడిచి వెళ్లాలని నిర్ణయించారు.
రుద్రప్రయాగ్‌కు చెందిన వరుడు రజనీష్ కూర్మాచారీ సుమారు ఎనభై మంది బంధువులతో కలిసి కార్లలో పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాడు. మంచు దట్టంగా కురువడంతో దారిలో కార్లు నిలిచిపోయాయి. వాహనాలు కదల్లేని పరిస్థితి. దీంతో అందరూ ఆందోళన చెందారు.

ఆరు కిలో మీటర్లు ప్రయాణిస్తే పెళ్లి మండపానికి చేరుకోవచ్చని వారికి తెలిసింది. దీంతో దీంతో వరుడు నడుచుకుంటూ పెళ్లి మండపానికి వెళ్దామని చెప్పాడు. మంచు తుఫానులో నడవడం చాలా కష్టం. మరో మార్గం లేక వారు నడిచి పెళ్లి మండపానికి చేరుకున్నారు.
వరుడు, అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు నడిచారు. పెళ్లి దుస్తుల్లో వరుడు నడుచుకుంటూ రావడం చూసిన స్థానికులు వారికి సహకారం అందంచారు. దీంతో పెళ్లి ముహూర్తానికంటే చేరుకున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications