Opinion poll: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు వదిలేసుకోవాల్సిందే..!!
భోపాల్: ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంటోంది. భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నుతోన్నాయి.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీనే మొదట ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పటికీ.. ఆ తరువాత జరిగిన ఆపరేషన్ లోటస్ నేపథ్యంలో అధికారాన్ని బీజేపీకి కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది మధ్యప్రదేశ్.

ఈ పరిస్థితుల మధ్య గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ తన ఒపీనియన్ పోల్‌ను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వే, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థ ఇది. తాజాగా మధ్యప్రదేశ్‌పై సర్వే చేపట్టింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఇది. జూన్ 5వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది.
మొత్తంగా 40,000 మంది అభిప్రాయాలను సేకరించింది. అన్ని సామాజిక వర్గాలను సంప్రదించింది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, శాంతి భధ్రతలు, నిరుద్యోగం, పరిశ్రమలు- పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులు.. ఇలా- అన్ని అంశాల ఆధారంగా వారి నుంచి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకుంది.
The GZR Team conducted a qualitative report and opinion poll in #MadhyaPradesh from June 5th to July 5th in 80 constituencies. The survey had a sample size of 40,000 and covered all castes, cohorts, and issues through face-to-face interviews. pic.twitter.com/x87a1YCssy
— Ground Zero Research (@GroundZResearch) July 24, 2023
ఈ సర్వే ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 127 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అలాగే- 42.67 శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారాన్ని అందుకుంటుందని గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. బీజేపీ వ్యతిరేక పవనాలను ఎదుర్కొంటోందని, ఓటమి తప్పకపోవచ్చని పేర్కొంది.
బీజేపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని గ్రౌండ్ జీరో సర్వే అంచనా వేసింది. 98 స్థానాలు మాత్రమే లభిస్తాయని స్పష్టం చేసింది గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ. ఈ పార్టీకి లభించే ఓట్ల శాతం 39.51 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న సీట్లు 130. ఈ ఫిగర్‌ను బీజేపీ ఏమాత్రం అందుకోలేదని, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications