కడపలో దందాలు, దొంగనోట్లు, దోపిడీలు, బెంగళూరు సిటీ బస్సులో నరికేశారు, 14 కేసులు!
బెంగళూరు: బెంగళూరు నగరంలో కదులుతున్న బీఎంటీసీ బస్సు (సిటీ బస్సు)లో యువకుడిని సినిమా స్టైల్లో దారుణంగా నరికేసిన హంతకుల కోసం ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు గురైయ్యింది ఆంధ్రప్రదేశ్ లోని కడపకు చెందిన సీతారాం అలియాస్ రాం సురేష్ (32)గా పోలీసులు గుర్తించారు. సీతారం మీద కడపలో 14కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
Recommended Video


తప్పించుకోవాలని !
బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కూనప్పన అగ్రహార సమీపంలో బుధవారం సీతారాం అలియాస్ రాం సురేష్ పరుగున వచ్చి బీఎంటీసీ బస్సులోనికి ఎక్కాడు. అతని వెనుకనే మరో ముగ్గురు అదే బీఎంటీసీ బస్సు ఎక్కారు.

వేటకోడవళ్లు
బస్సులోకి వెళ్లిన సీతారాం అలియాస్ రాం సురేష్ ను మిగతా ముగ్గురూ ఒక్కసారిగా చుట్టుముట్టి సినిమా స్టైల్ లో వేటకోడవళ్లతో విచక్షణారహితంగా నరికేశారు. అనంతరం సీతారం అలియాస్ రాం సురేష్ చచ్చాడని నిర్దారించుకున్న ముగ్గురు బస్సు దిగి తాపీగా తప్పించుకుని పారిపోయారు.

వేడుకున్నాడు
సీతారాం అలియాస్ రాం సురేష్ తనును కాపాడాలని సాటి ప్రయాణికులను వేడుకున్నాడు. ప్రత్యర్థుల చేతిలో ఉన్న వేటకోడవళ్లు చూసిన ప్రయాణికులు భయంతో దగ్గరకు వెళ్లడానికి సాహసం చెయ్యలేక గట్టిగా కేకలు వెయ్యడంతో డ్రైవర్ బస్సు నిలిపి డోర్ ఓపెన్ చేశాడు.

కడప నుంచి బస్సులో
కడప నుంచి సీతారాం అలియాస్ రాం సురేష్ బస్సులో బెంగళూరు చేరుకుని తరువాత నగర శివార్లలోని హొసకోటకు చేరుకున్నాడు. ప్రత్యర్థులు తనను వెంబడిస్తున్నట్లు గుర్తించిన సీతారాం అలియాస్ రాం సురేష్ అక్కడి నుంచి వేరొక బస్సులో కూనప్పన అగ్రహారాకు చేరుకున్నాడు.

బస్సు డ్రైవర్, కండెక్టర్
సితారాం అలియాస్ రాం సురేష్ రక్షించాలని వేడుకున్నా తాము ఏమీ చెయ్యలేకపోయామని బీఎంటీసీ బస్సు డ్రైవర్, కండెక్టర్ విచారం వ్యక్తం చేశారని పోలీసులు చెప్పారు. సీతారాం అలియాస్ రాం సురేష్ ను హత్య చేసిన నిందితులు నగరంలోనే తలదాచుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కడప నుంచి ఫాలో
సితారాం అలియాస్ రాం సురేష్ ను అతని ప్రత్యర్థులు అనుమానం రాకుండా కడప నుంచి బెంగళూరుకు ఫాలో అయ్యారు. హోసకోటలోనే సీతారాం అలియాస్ రాం సురేష్ ను హత్య చెయ్యాలని నిందితులు ప్రయత్నించినా అక్కడ వీలుకాలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

14 క్రిమినల్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లోని కడప నివాసి అయిన సీతారాం అలియాస్ రాం సురేస్ స్థానికంగా పలు నేరాలకు పాల్పడ్డాడని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సీతారాం అలియాస్ రాం సురేష్ కొందరు యువకులను గ్రూపుగా ఏర్పాటు చేసుకుని కడపలో దోపిడీలు, దోంగనోట్ల మార్పిడి, దందాలు చేశాడని, అతని మీద 14 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications