జీఎస్టీ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో జీఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టారు. పార్లమెంట్ వీటికి ఆమోదం తెలిపిన తరువాత రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ బిల్లులను ఆయా అసెంబ్లీలలో ప్రవేశపెడతాయి.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో జీఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టారు. ఐజీఎస్టీ, సీజీఎస్టీ, యూటీజీఎస్టీ బిల్లులను మంత్రి ప్రవేశపెట్టగా, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఈ చర్యను ప్రశ్నించారు.

టెక్నికల్ గ్రౌండ్ పై జీఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టడం కుదరదన్నారు. సభా వ్యవహారాల విధానం ప్రకారం బిల్లులను ప్రవేశపెట్టాలన్నారు. బిల్లులను వ్యతిరేకించడం లేదని, కానీ ఆ బిల్లులను ప్రవేశపెట్టిన పద్ధతి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

GST bills tabled in Lok Sabha by Finance Minister Arun Jaitley

అయితే సభ బిజినెస్ కు సంబంధించి శుక్రవారమే సమాచారం చేరవేసినట్లు జైట్లీ తెలిపారు. మార్చి 29న లోక్ సభలో జీఎస్టీ బిల్లులపై చర్చ జరగనుంది. ఐజీఎస్టీ, సీజీఎస్టీ, యూటీజీఎస్టీ, పరిహార చట్టాలను లోక్ సభలో ప్రవేశపెట్టి మంగళవారం చర్చించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చట్టంలోని వివిధ సెస్ లను రద్దు చేసే సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కీలక బిల్లులపై ఎంత సేపు చర్చించాలన్న దానిపై బీఏసీ రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.

ఆ తరువాత వీటిని రాజ్యసభలో ప్రవేశపెడతారు. అక్కడ ఏమైనా సవరణలు సూచిస్తే.. వాటిపై చర్చించడానికి లోక్ సభకు తగిన సమయం లభిస్తుంది. ఆ సవరణలను లోక్ సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 12న ముగియనున్నాయి.

వీటిని ద్రవ్య బిల్లులుగానే ప్రవేశపెడుతున్నా.. రెండు సభల్లోనూ తగిన చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్టీని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్లమెంట్ వీటికి ఆమోదం తెలిపిన తరువాత రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ బిల్లులను ఆయా అసెంబ్లీలలో ప్రవేశపెడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+