తగ్గిన జీఎస్టీ వసూళ్లు: పన్నురేట్ల తగ్గింపే కారణం
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు జనవరి నెలలో స్వల్పంగా తగ్గి రూ.86,318 కోట్లు వసూలు అయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. డిసెంబర్‌లో రూ.86,703 కోట్లు వసూలు కాగా, జనవరిలో రూ.385 కోట్లు తగ్గాయి.

కాగా, 2017లో చివరి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. అక్టోబర్ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ దాదాపు 200 వస్తూవులపై పన్ను రేట్లను తగ్గించింది. జీఎస్టీలో ఫిబ్రవరి 25 వరకు 1.03 కోట్ల మంది రిజిస్టర్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.
వీరిలో 17.65 లక్షల మంది కాంపోజిషన్ డీలర్లు ఉన్నారని పేర్కొంది. వీరు మాత్రమే మూడునెలకు ఒక సారి పన్ను రిటర్నులను ఫైల్ చేయాలి. మిగిలిన వారు ప్రతినెలా పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications