వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ ఎఫెక్ట్ మామూలుగా లేదు: సూపర్ కార్లపై రూ.కోటి తగ్గింపు

ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ ప్రభావం కార్లపై బాగానే ఉంది. దాదాపు అన్ని కార్ల ధరలు కూడా తగ్గిపోవడం గమనార్హం. అంతేగాక, లగ్జరీ కార్ల తయారీదారులు కూడా జీఎస్టీ పుణ్యమా అ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ ప్రభావం కార్లపై బాగానే ఉంది. దాదాపు అన్ని కార్ల ధరలు కూడా తగ్గిపోవడం గమనార్హం. అంతేగాక, లగ్జరీ కార్ల తయారీదారులు కూడా జీఎస్టీ పుణ్యమా అని.. పాపులర్ మోడల్స్‌పై రేట్లను భారీగా తగ్గించేస్తున్నారు.

తీపి కబురే

తీపి కబురే

ప్రస్తుతం సూపర్ కారు తయారీదారులు రోడ్డు పన్నును రూ.20లక్షల వరకు తగ్గించేశాయి. అంతర్గత రాష్ట్రాల పరిమితులతో ఇన్ని రోజులు కార్ల రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ మొత్తంలో రోడ్డు పన్నులు చెల్లించేవారికి ఇది తీపి కబురనే చెప్పవచ్చు.

రూ. కోటి తగ్గింపు

రూ. కోటి తగ్గింపు

కొత్త జీఎస్టీ రేట్లు, అప్‌డేటెడ్ రోడ్డు పన్ను విధానంతో సూపర్ కార్లు చాలా చౌకగా మారుతున్నాయి. సూపర్ కారు తయారీదారుల్లో ఒకటైన లంబోర్గిని దాదాపు కోటి రూపాయలకు పైగా ధరలను తగ్గించేయడం విశేషం.

మిగతా సూపర్ కార్లు కూడా..

మిగతా సూపర్ కార్లు కూడా..

ఒక వేళ తమ సూపర్ కారు అవెంటడర్ ఎస్ కొనుగోలు చేయాలనుకునే వారికి రూ. 1.05 కోట్ల వరకు తగ్గింపు పొందుతారని లంబోర్గిని స్పష్టం చేసింది. అయితే దీనిలో ఇన్స్యూరెన్స్ ధరలు కలుపలేదు. ఆప్షన్ మార్టిన్, ఫెరారీ, రోల్స్ రాయిస్ మోడల్స్, బెంట్లీ లాంటి మిగతా సూపర్ కార్లు, స్పోర్ట్స్ కార్ల తయారీదారులు కూడా త్వరలోనే తమ కార్ల ధరలను తగ్గించనున్నట్లు సమాచారం.

ధరలు ఇలా..

ధరలు ఇలా..

లంబోర్గిని అవెంటర్ ఎస్
ఎక్స్ షోరూం ధర - (జీఎస్టీకు ముందు)రూ. 5.01కోట్లు-(జీఎస్టీ తర్వాత-రూ.5.01)
రోడ్డు పన్ను - రూ. కోటి (రూ. 20లక్షలు-(క్యాప్ లిమిటెడ్-జీఎస్టీ తర్వాత))
ఆక్ట్రాయ్ - రూ. 22.54లక్షలు-(జీఎస్టీ తర్వాత నాటి అప్లికేబుల్)
ఆన్ రోడ్ ధర - రూ. 6.23కోట్లు-(జీఎస్టీ తర్వాత రూ.5.21కోట్లు)

English summary
There was much joy for luxury carmakers when the GST rates saw car prices slide down and making them more affordable but now even supercar makers get to bask in that same glory as the road tax has been capped at ₹ 20 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X