Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లక్ష లంచం డిమాండ్.. పట్టుబడ్డ జీఎస్‌టీ అధికారి

ముంబై : పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ.. కొందరు అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. జీఎస్టీని పర్యవేక్షించాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ జీఎస్టీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. అదే క్రమంలో మహారాష్ట్రలోని పుణేలో ఓ అధికారి పట్టుబడటం చర్చానీయాంశమైంది.

జీఎస్టీ పన్నుల శాఖకు చెందిన క్లాస్ - 2 విభాగం అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం చర్చానీయాంశమైంది. పన్ను చెల్లింపు విషయంలో పూణేలోని ఓ వ్యక్తికి జీఎస్టీ పన్నుల శాఖ నోటీసులు జారీచేసింది. అయితే ఆ నోటీసులను వెనక్కి తీసుకోవాలని సదరు వ్యక్తి జీఎస్టీ అధికారిని కోరాడు.

GST Officer Caught in Bribe case in pune

అయితే సదరు జీఎస్టీ అధికారి నోటీసులు ఉపసంహరించుకునేందుకు లక్ష రూపాయలు డిమాండ్‌ చేశాడు. నోటీసులు అందుకున్న సదరు వ్యక్తి నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+