టీనేజర్లను ఆకర్షిస్తున్న GTA 6 గేమ్..తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి..!!
ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమింగ్ రంగంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్‌లలో'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6'(GTA 6)ఒకటి.రాక్‌స్టార్ గేమ్స్ రూపొందిస్తున్న ఈ గేమ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.సోషల్ మీడియా,యూట్యూబ్,గేమింగ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.అయితే ఈ గేమ్ కోసం యువత చూపిస్తున్న ఆసక్తి ఇప్పుడు తల్లిదండ్రుల్లో కొత్త ఆందోళనకు కారణమవుతోంది.ముఖ్యంగా టీనేజర్లు ఈ గేమ్‌కు ఆకర్షితులవుతుండటంతో అసలు ఇందులో ఏముంది?పిల్లలు ఆడేందుకు ఇది సురక్షితమేనా?అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
గేమ్ కాదు..నేర ప్రపంచానికి అద్దం
GTA సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమానులున్నారు.ఈసారి GTA 6లో జేసన్,లూసియా అనే రెండు ప్రధాన పాత్రల చుట్టూ కథను నడిపిస్తున్నారు.నేర ప్రపంచం,దోపిడీలు, హింసాత్మక సంఘటనలు,మాదకద్రవ్యాలు,పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన లైంగిక అంశాలు వంటి వివాదాస్పద కంటెంట్ ఈ గేమ్‌లో చోటుచేసుకున్నాయి.అందుకే ఇది చిన్నపిల్లల కోసం రూపొందించిన సాధారణ వినోదాత్మక గేమ్ కాదు.ఈ తరహా అంశాల కారణంగా GTA సిరీస్‌లోని గేమ్‌లకు వివిధ దేశాల వయోపరిమితి సంస్థలు కఠినమైన రేటింగ్‌లు కేటాయిస్తున్నాయి.GTA 6 విషయంలోనూ పెద్దలకు మాత్రమే అనుమతించే వయోపరిమితి రేటింగ్‌లు వర్తించే అవకాశం ఉంది.అంటే పిల్లలు,టీనేజర్లు ఈ గేమ్‌కు దూరంగా ఉండాలన్నదే ఈ రేటింగ్‌ల ప్రధాన ఉద్దేశం.

ఆడకపోయినా ప్రమాదమేనా? యూట్యూబ్ వీడియోలతోనూ ముప్పు
ఇక్కడ తల్లిదండ్రులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది.పిల్లలు గేమ్ ఆడకపోయినా యూట్యూబ్ వంటి వేదికల్లో ఇతరులు ఆడే గేమింగ్ వీడియోలను చూస్తుంటారు.గేమింగ్ స్ట్రీమర్ల వ్యాఖ్యలు,హింసాత్మక దృశ్యాలు,లైవ్ చాట్‌లలో ఉపయోగించే అసభ్య పదజాలం కూడా పిల్లలకు చేరే అవకాశం ఉంది.దీంతో గేమ్ కొనివ్వలేదు కదా అని నిశ్చింతగా ఉండటం సరిపోదు.పిల్లలు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు?ఎవరిని ఫాలో అవుతున్నారు?ఎలాంటి కంటెంట్‌కు ఆకర్షితులవుతున్నారు?అన్నది కూడా తల్లిదండ్రులు గమనించాలి.
హింసాత్మక గేమ్స్‌తో పిల్లల్లో ప్రవర్తనా మార్పులు వస్తాయా?
హింసాత్మక వీడియో గేమ్స్‌కు,నిజ జీవితంలో తీవ్రమైన నేర ప్రవర్తనకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని నిర్ధారించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ (APA) గతంలో పేర్కొంది.అయితే హింసాత్మక కంటెంట్‌ను ఎక్కువగా చూడటం,ఆడటం వల్ల పిల్లల ఆలోచనలు,భావోద్వేగాలు,ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.ముఖ్యంగా వయసుకు మించిన లైంగిక దృశ్యాలు,మహిళలను కించపరిచే అంశాలు,హింసను సాధారణ వినోదంగా చూపించే కంటెంట్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తల్లిదండ్రులు అప్రమత్తంగా పరిశీలించాలి.
పిల్లలను ఎలా కాపాడుకోవాలి? తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకోండి
పిల్లలు ఇలాంటి గేమ్స్‌పై ఆసక్తి చూపినప్పుడు వారిని తిట్టడం,భయపెట్టడం కంటే అందులోని కంటెంట్ గురించి వివరించడం మంచిది.గేమ్ కొనుగోలు చేసే ముందు దాని వయోపరిమితి రేటింగ్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
- ప్లేస్టేషన్,ఎక్స్‌బాక్స్ వంటి పరికరాల్లో పేరెంటల్ కంట్రోల్స్‌ను యాక్టివేట్ చేయాలి.
- పిల్లల ఖాతాలకు వయోపరిమితి నిబంధనలు ఏర్పాటు చేయాలి.
- పెద్దల గేమింగ్ ప్రొఫైళ్లకు పాస్‌వర్డ్ రక్షణ కల్పించాలి.
- యూట్యూబ్,ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లలు చూస్తున్న కంటెంట్‌పై నిఘా ఉంచాలి.
- గేమింగ్‌కు రోజువారీ సమయ పరిమితులు విధించాలి.
- పిల్లలకు నచ్చిన ప్రత్యామ్నాయ ఆటలు,క్రీడలు,సృజనాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించాలి.
ముఖ్యంగా పిల్లలు ఏదైనా అనుచితమైన వీడియో చూసినా,గేమ్ ఆడినా భయం లేకుండా తల్లిదండ్రులతో చెప్పగలిగే వాతావరణం ఇంట్లో ఉండాలి.
గుర్తుంచుకోండి..పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం కంటే దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించడం ముఖ్యం.GTA 6 వంటి గేమ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్నప్పటికీ,ఆ క్రేజ్‌కు పిల్లల వయసు, మానసిక పరిపక్వతను బలిచేయకూడదు.డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు సరైన పర్యవేక్షణ ఉండటం కూడా అంతే ముఖ్యం.












Click it and Unblock the Notifications
